Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలలు ఒక ఏడాది కన్నా ఎక్కువ సమయం విరామం తీసుకున్న అనంతరం ఇప్పుడు ఆఫ్‌లైన్ అభ్యాసానికి సిద్ధం అవుతున్నారు. పాఠశాలకు దూరంగా ఉండే ఈ సమయంలో, బాలలు తమను తాము అభివ్యక్తీకరించేందుకు చాలా అరుదైన వేదికను కనుగొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ బాలల దినోత్సవం రోజున భారతదేశంలోని ప్రముఖ పిల్లల వినోద ఫ్రాంచైజీ - నికెలోడియన్ #NoStressExpress అనే ఆహ్లాదకరమైన మరియు సాధికారత కలిగిన క్యాంపెయిన్ ద్వారా ఎటువంటి ఫిల్టర్ లేకుండా బాలలు తమ మనసులోని భావాలను వెల్లడించేందుకు, వారిని ప్రేరేపించేందుకు ముందుకు వచ్చింది. వయాకామ్ 18 మార్కెటింగ్, కిడ్స్ క్లస్టర్ హెడ్ సోనాలి భట్టాచార్య ఈ క్యాంపెయిన్ గురించి మాట్లాడుతూ, ‘‘నికెలోడియన్‌లో, మేము చేపట్టే ప్రతి చొరవలో బాలలు మరియు వారి అభిరుచులు కీలక స్థానంలో ఉండేలా చూసుకుంటాము. గత ఏడాది బాలలు భౌతిక తరగతులకు పూర్తిగా దూరమయ్యారు మరియు తమ స్నేహితులకు దూరంగా ఉండటంతో సామాజికంగా ఒంటరి అనే భావనను ఎదుర్కొన్నారు. బాలలు చాలా చెప్పాలని మేము కోరుకుంటున్నాము అలాగే వారి అభిప్రాయాలు చాలా ప్రత్యేకమైనవి. వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించేందుకు వారికి ఒక వేదికను కల్పిస్తున్నామని బాలల దినోత్సవం రోజు మేము ప్రారంభిస్తున్న క్యాంపెయిన్ ద్వారా వారికి తెలియజేస్తున్నాము. దీనితో బాలలు ఎటువంటి ఫిల్టర్ లేకుండా వారికి అనిపించిన విషయాన్ని నేరుగా అభివ్యక్తీకరించేందుకు అవకాశం కలుగుతుంది.
ఈ క్యాంపెయిన్‌కు వివిధ ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ అనుభవాల ద్వారా ప్రాణం పోయడం ద్వారా బాలలను బాలల దినోత్సవం రోజున సొంతం చేసుకోవాలని మరియు వారి హృదయాలను, మనస్సులోని అభిప్రాయాలను బయటపెట్టమని కోరుతుంది- ఇది నూడుల్స్‌పై వారి ప్రేమ, హోంవర్క్‌పై అభిప్రాయం లేదా కూరగాయల పట్ల వారికున్న అయిష్టతను వ్యక్తపరిచేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా, నిక్ తన సూపర్ స్టార్ నిక్టూన్స్ ద్వారా - Chikoo & Bunty, Happy & Pinaki, Paw Patrol మరియు ఇతరులు 10-క్షణాల వీడియోలో తమ మనసులోని మాటను నిక్కచ్చిగా మాట్లాడి, nickindia.comలో అప్లోడ్ చేయాలని పిలుపునివ్వగా, అది నిక్లో ప్రసారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీనితో పాటు, బాలలను అలరించేందుకు ఫ్రాంచైజీ ఛానెళ్లలో నవంబర్ 13 & 14 తేదీలలో ప్రత్యేక బాలల దినోత్సవ ప్రోగ్రామింగ్ స్టంట్స్ కూడా ప్లాన్ చేశారు. ఛానల్ ఎక్స్‌ప్రెస్-ఎ-థాన్ ద్వారా పిల్లలను ఒత్తిడి లేని రైడ్‌కి తీసుకెళ్లడమే కాకుండా, 99 పాన్‌కేక్స్ లిమిటెడ్ ఎడిషన్ కాంబోలతో పిల్లలు తమకు ఇష్టమైన నిక్టూన్ల పట్ల తమ ప్రేమను కూడా వ్యక్తం చేయవచ్చు! ప్రత్యేకంగా క్యూరేటెడ్ కాంబోలు Zomato, Swiggy, డైన్-ఇన్ ఆర్డర్లు మరియు టేక్అవేలలో అందుబాటులో ఉంటాయి. పిల్లలు తమకు ఇష్టమైన నిక్టూన్లతో ఎక్స్‌ప్రెస్ థాన్‌లో చేరాలని పిలుపునిచ్చే మమ్మీ నెట్‌వర్క్‌లు మరియు ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రచారం మరియు దాని సందేశం మరింత విస్తరించబడుతున్నాయి. దేశవ్యాప్తంగా నిక్టూన్లతో చాలా సరదా మాల్ యాక్టివేషన్లు మరియు మీట్ & గ్రీట్లతో కూడా దీనికి మద్దతు లభిస్తుంది.
Nick Be the Boss, #KhulKeBolo మరియు Bacchon Jaisi Baatein వంటి ఇతర ప్రచారాలతో, Nickelodeon ఎల్లప్పుడూ బాలల దినోత్సవం నాడు పిల్లల స్ఫూర్తికి అనుగుణంగా జరుపుకుంటుంది. ఈసారి కూడా, నికెలోడియన్ దాని నిక్ టూన్ల సైన్యంతో పాటు పిల్లలు తమ భావాలను వ్యక్తీకరించేందుకు ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉంది. కనుక పిల్లలూ, ఈ బాలల దినోత్సవాన్ని గుర్తుంచుకోండి - ఒత్తిడి లేదు ...ఎక్స్‌ప్రెస్