Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదారాబాద్: భారతదేశంలోని ప్రముఖ అమ్యూజ్మెంట్ పార్క్ చెయిన్ వండర్లా హాలిడేస్ లిమిటెడ్, 600 మంది నిరుపేద పిల్లలను తమ బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి పార్కులకు ఆహ్వానించి బాలల దినోత్సవాన్ని నిర్వహించుకుంది. ఈ బాలలకు వారి ప్రత్యేక రోజును మరింత గుర్తుండేలా చేసేందుకు ఉచిత టిక్కెట్లతో పాటు లంచ్, హై-టీ, వాటర్ రైడ్ కోసం కాస్ట్యూమ్స్ అందించారు. ఈ సందర్భంలో వండర్లా హాలిడేస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె చిట్టిలపిల్లి మాట్లాడుతూ, ‘‘వండర్లాలో మేము ప్రతిసారి సామాజిక బాధ్యతకు కట్టుబడి ఉంటామని విశ్వసిస్తున్నాం. దేశవ్యాప్తంగా బాలలు అందరికీ ప్రత్యేకంగా అంకితమైన రోజున ఆనందకరమైన వేడుకలు చేసుకునే హక్కు ఉంటుందని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రయత్నాన్ని చేశాము’’ అని పేర్కొన్నారు. వేడుకల్లో భాగంగా మూడు పార్కుల్లో పెయింటింగ్, డ్రాయింగ్, వంటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. బుకింగ్ కోసం వండర్లా వెబ్సైట్ను పరిశీలించండి: https://www.wonderla.com/, లేదా ఫోన్ నంబర్ల ద్వారా చేరుకోండి: Hyderabad - 040 23490300, 040 23490333