Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశం లోనే అతిపెద్ద ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని సౌలభ్యాన్ని ఎత్తి వేసింది. సోమవారం నుంచి సంస్థ ఉద్యోగులంతా తాము పనిచేస్తున్న కేంద్రాలకు హాజరయ్యారు. గతేడాది కరోనా మహమ్మారిని నియంత్రించడానికి ఉద్యోగులకు ప్రారంభంలోనే టీసీఎస్ ఇంటి నుంచి పని విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇటీవల సగం మంది ఉద్యోగులకు మాత్రమే ఇంటి నుంచి పని సౌలభ్యాన్ని ఇవ్వగా.. తాజాగా అది దాదాపు ఎత్తేసింది. 2025 నాటికి ఉద్యోగుల్లో 25 శాతం మంది మాత్రమే కార్యాలయాల్లో విధులు నిర్వర్తించే విధానానికి ఇప్పటికే టీసీఎస్ ప్రణాళికలు రూపొందిస్తుంది. ఉద్యోగులు పూర్తిగా ఆఫీసులకు రావడం ప్రారంభమైన తర్వాత క్రమంగా 25/25 మోడల్‌కు వెళతామని టీసీఎస్ తెలిపింది. గతవారం వరకు టీసీఎస్‌లో కేవలం ఐదు శాతం మంది ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారు. తమ సిబ్బందిలో 70 శాతం రెండు డోస్‌లు, 95 శాతం మంది సింగిల్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారని ఇటీవలే ఆ సంస్థ తెలిపింది.