Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్లకు స్పల్ప లాభాలు
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ రోజే దుమ్మురేపిన నైకా కంపెనీ షేర్లు సోమవారం సెషన్లో ఒత్తిడికి గురయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలు రూ.1.20 కోట్లకు పడిపోయినట్టు ఆ సంస్థ ప్రకటించడంతో మదుపర్లలో అవిశ్వాసం చోటు చేసుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.27 కోట్ల లాభాలు ఆర్జించింది. గడిచిన త్రైమాసికంలో కంపెనీ లాభాలు పడిపోవడంతో ఆ ప్రభావం వారం తొలి సెషన్లో ఒక్కసారిగా కంపెనీ షేర్లపై పడటంతో 7 శాతం మేర క్షీణించాయి. తుదకు బీఎస్ఈలో 3.82 శాతం కోల్పోయి రూ.2,268.10 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఒక్కో షేరు ధర 44 మేర పడిపోయింది. ధర ఏమైనా తగ్గి రూ.1900 దగ్గర ట్రేడ్ అయితే ఈ షేర్లు కొనుగోలు చేయడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య తుదకు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం మార్కెట్ ప్రారంభంలో సానుకూల వాతావరణం కనిపించడంతో దేశీ సూచీలు పైకి పరుగులు పెట్టగా.. మధ్యాహ్నం నుంచి అమ్మకాలు చోటు చేసుకున్నాయి. దీంతో తుదకు సెన్సెక్స్ 32 పాయింట్లు పెరిగి 60,718కు చేరింది. నిఫ్టీ 7 పాయింట్లు లాభపడి 18,109 వద్ద ముగిసింది.