Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: లాభాపేక్షలేని ఈటీఎస్ నేడు ఈటీఎస్ ఇండియాను అధికారికంగా ఏర్పాటుచేసినట్లు వెల్లడించింది. తద్వారా భారతదేశంలో తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు కార్యాలయం ఏర్పాటుచేయడంతో పాటుగా సంస్థ యొక్క అంతర్జాతీయ పాదముద్రికలను విస్తరించి, అభ్యాసకులకు తమ జీవితాంతపు విద్యా ప్రయాణంలో సేవలనూ అందించనుంది. లెజో శామ్ ఊమ్మెన్, ఈటీఎస్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలనందించనున్నారు. మేనేజింగ్ డైరెక్టర్‌గా, భారతదేశంలో తమ ఉత్పత్తులు, సేవల కోసం ఈటీఎస్ యొక్క వృద్ధి వ్యూహాలను అభివృద్ధి చేయడంతో పాటుగా అమలు చేయడమూ ఊమ్మెన్ చేయనున్నారు.
భారతదేశపు విద్యా సమాజానికి మద్దతునందించడానికి ఈటీఓస్ కట్టుబడి ఉంది. దేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా అభ్యాసకులకు మద్దతునందించడంలో అత్యంత సహజమైన ముందడుగుగా ఈటీఎస్ ఇండియా నిలుస్తుంది. అదే సమయంలో ఉన్నత విద్యా సంస్థలు విభిన్నమైన గ్రాడ్యుయేట్ విద్యార్థులను ఆకర్షించడం కొనసాగించడంలోనూ తోడ్పడనుంది. ఈటీఎస్ ఇండియా ఏర్పాటుతో దేశంలో కీలక భాగస్వాములతో సంస్థ యొక్క సంబంధాలు మరింతగా బలోపేతం కావడం కొనసాగనుంది. పాఠశాలలు, ఇనిస్టిట్యూట్లు, కార్పోరేషన్లు, విద్యా సంస్థలు, భాషా శిక్షకులు, విదేశాలలో విద్యకు సలహాదారులు సహా సహకారం, పెట్టుబడుల పరంగా ఈటీఎస్‌తో పాటుగా భారతీయ వ్యాపార సంస్థలకు మెరుగైన అవకాశాలు అందించనుంది.
‘‘నూతన విద్యా విధాన (ఎన్ఈటీ)కార్యాచరణ ద్వారా భారతీయులందరికీ నాణ్యమైన విద్యావకాశాలను మెరుగుపరచడం, తగు రీతిలో సంస్కరణలు చేయడం, వాటిని విస్తృతం చేయాలనే మరియు భారతీయ విద్యార్థులకు మెరుగైన అవకాశాలను అందుబాటులోకి తీసుకురావాలనే భారతదేశపు ధైర్యవంతమైన, దూరదృష్టితో కూడిన విధానానికి అనుగుణంగా ఈటీఎస్ ఉంటుంది’’ అని మొహమ్మద్ కౌషా, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ గ్రోత్–ఈటీఎస్ అన్నారు. ‘‘విద్య పరంగా ప్రతి ఒక్కరికీ నాణ్యత, సమానత్వం పెంపొందించాలనే ఈటీఎస్ యొక్క లక్ష్యిత ఆధారిత విధానం ఈ ముందు చూపుకు అనుగుణంగా ఉంటుంది. భారతీయుల కోసం భారతదేశంలో అభ్యాస అవకాశాలను విస్తరించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. లెజో మా బోర్డ్‌పై రావడంతో మా లక్ష్యం సాకారం కావడంలో సహాయపడగలరు’’అని అన్నారు.
‘‘భారతదేశంలో ఉన్న అభ్యాసకులపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటుగా భవిష్యత్‌లో అంతర్జాతీయంగా ఉన్న అభ్యాసకులకు సేవలనందించాలనే లక్ష్యంలో భాగంగా సంస్థ గణనీయంగా మార్పుకు లోనవుతున్న వేళ ఈటీఎస్‌లో చేరడం, సంస్ధ భారతీయ కార్యాలయం, సిబ్బందికి నేతృత్వం వహించనుండటం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను’’ అని ఊమ్మెన్ అన్నారు. ‘‘భారతదేశంలో ఇప్పటికే బలీయంగా ఉన్న పునాదులపై నిర్మించడంతో పాటుగా టోఫెల్ ఎస్సెస్మెంట్స్, జీఆర్ఈ టెస్ట్ మరియు టోఇక్ పరీక్షతో పాటుగా నూతన అభ్యాస ఉపకరణాలు, వ్యాపార అవకాశాలు సహా ఈటీఎస్ యొక్క ప్రస్తుత ఉత్పత్తులను బలోపేతం చేయడం నా లక్ష్యం’’ అని అన్నారు.
పియర్శన్ వద్ద ఊమ్మెన్ జనరల్ మేనేజర్‌గా సేవలనందించారు. పీటీఈ అకడమిక్ పరీక్ష ఆయన పర్యవేక్షణలో జరిగింది. ఈ సంస్థ శక్తివంతమైన వ్యాపార పనితీరుకు, ఈ సంస్థ వృద్ధి, ఆదాయం, నిర్వహణ పనితీరు, లాభదాయకత పరంగా ఆయన అందించిన తోడ్పాటు పరంగా గుర్తింపు పొందారు. పియర్శన్కు ముందు, రిలయన్స్ మనీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తదితర సంస్థలలో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. బెంగళూరు యూనివర్శిటీ పూర్వ విద్యార్థి ఆయన.
కొవిడ్ 19 ప్రభావం చూపినప్పటికీ, పరిశోధన, పరిశీలన పరిష్కారాలను అందించడంపై ఈటీఎస్ తమ దృష్టిని కొనసాగిస్తుంది. భారతీయ విద్యార్థులు, ఇనిస్టిట్యూట్ల అవసరాలు, ఆసక్తులకు తగిన సేవలను అందిస్తుంది. తద్వారా వారి విద్యావసరాలు, ఇతర అవసరాల పరంగా ఎలాంటి అవరోధాలూ ఎదురుకావడం లేదు. ఇంటి వద్దనే పరీక్షలు రాసే అవకాశం కల్పించే టోఫెల్ ఐబీటీ హోమ్ ఎడిషన్, జీఆర్ఈ జనరల్ టెస్ట్ ఎట్ హోమ్ ప్రారంభించడం అలాగే భారతదేశంలో ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డుగా ఆధార్‌కార్డును వినియోగించడం, టోఫెల్ ఎసెన్షియల్ కిట్‌ను ఆవిష్కరించడం ద్వారా ఇది నిరూపితమైంది.