Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: సంస్థాగత పరివర్తనకనుగుణంగా మెడాల్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ తమ నూతన బ్రాండ్ గుర్తింపుతో పాటుగా నూతన ట్యాగ్ లైన్ ‘ఎక్సపర్స్ హు కేర్’ను ప్రకటించడంతో పాటుగా వేగవంతమైన విస్తరణ ప్రణాళికలను సైతం వెల్లడించింది. ఈ సమగ్రమైన డయాగ్నోస్టిక్స్ అగ్రగామి సంస్థ ఇటీవలనే రవి అగర్వాల్‌ను తమ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా నియమించినట్లు వెల్లడించింది.
మెడాల్ వృద్ధి/విస్తరణ ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్లడంలో అత్యంత కీలక పాత్రను ఆయన పోషించనున్నారు. అమ్మకాలు,మార్కెటింగ్, ఫ్రాంచైజీ కార్యకలాపాలు, ల్యాబ్ ఆపరేషన్స్, కస్టమర్ ఆపరేషన్స్, మౌలిక వసతులు, నియామకాలను సైతం ఆయన పర్యవేక్షించనున్నారు. మెడాల్‌లో రవి చేరిక గురించి మెడాల్ సీఈవో అర్జున్ అనంత్ మాట్లాడుతూ‘‘ వేగవంతమైన వృద్ధి, విస్తరణ ప్రణాళికలతో బ్రాండ్ ఇప్పుడు రూపాంతర ప్రయాణంలో ఉండగా రవి అగర్వాల్ మెడాల్‌లో చేరారు. వృద్ధిని వేగవంతం చేయాలనే మా వ్యూహం, కోరికను రవి నియామకం ప్రతిబింబిస్తుంది. రాబోయే 12–18 నెలల్లో ఎన్నో కార్యక్రమాలకు ప్రణాళిక చేశాం. మా తరువాత దశ వృద్ధికి రవి నేతృత్వం వహించనున్నారు’’ అని అన్నారు
మెడాల్ సీఓఓ రవి అగర్వాల్ మాట్లాడుతూ ‘‘నా పట్ల సంస్థ చూపుతున్న నమ్మకాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాను. కోవిడ్–19 మహమ్మారి కారణంగా ఆరోగ్యసంరక్షణ రంగంపై దృష్టి పడింది. మరీ ముఖ్యంగా నివారణ ఆరోగ్యం అత్యంత కీలకం అయింది. మెడాల్ ఇప్పుడు తమ అత్యున్నత స్థాయి సేవలు, నూతన బ్రాండ్ గుర్తింపుతో వినియోగదారుల ఆరోగ్య, సంక్షేమ అవసరాల కోసం విశ్వసనీయ ఏకీకృత కేంద్రంగా నిలుస్తుంది’’ అని అన్నారు. రవి, తనతో పాటుగా రెండు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని తీసుకువచ్చారు. అంతకు ముందు ఆయన రాన్‌బాక్సీ, మెర్క్, ఎల్డర్ హెల్త్‌కేర్, ఎంఎస్డీ ఫార్మాస్యూటికల్స్, పాత్కైండ్ ల్యాబ్స్‌లో చేసిన అనుభవం కలిగి ఉన్నారు. ఎస్ఆర్ఎల్ డయాగ్నోస్టిక్స్ నుంచి రవి అగర్వాల్ ఇప్పుడు మెడాల్‌లో చేరారు. ఎస్ఆర్ఎల్లో సీఓఓగా ఆయన దక్షిణ, పశ్చిమ, మధ్య భారతం, అంతర్జాతీయ కార్యకలాపాలకు నిర్వహించారు.