Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశంలోనే అతిపెద్ద ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)కు రానున్న ఎల్ఐసిలో వాటాల కొనుగోళ్లకు యాంకర్ ఇన్వెస్టర్లు భారీ ఆసక్తి కనబర్చుతున్నారు. ఇందుకోసం పది మంది మర్చంట్ బ్యాంకర్లను దాదాపుగా 100 గ్లోబల్ ఇన్వెస్టర్లు సంప్రదించినట్లు సమాచారం. డిసెంబర్ తొలి వారంలో ఐపిఒ ప్రతిపాదనలను మార్కెట్ రెగ్యూలేటర్ సెబీకి సమర్పించనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన ఓ వ్యక్తి తెలిపారు. ఇందుకు ఎల్ఐసి విలువ ఖరారు కావడమే ఆలస్యమని పేర్కొంది. కాగా దీనిపై స్పందించడానికి ఎల్ఐసి అధికార వర్గాలు నిరాకరించాయి. ఎల్ఐసి విలువ రూ.8-10 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఇందులో 5-10 శాతం వాటాను విక్రయించాలని మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఎల్ఐసిలోని వాటాలను విదేశీ శక్తులకు విక్రయించే యోచనలో కేంద్రం ఆసక్తిగా ఉందని ఇది వరకు రిపోర్టులు వచ్చాయి. వచ్చే ఏడాది మార్చి కల్లా ఎల్ఐసిలో వాటాలను విక్రయించాలని మోడీ సర్కార్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఎల్ఐసి ఐపిఒ కోసం కేంద్రం 10 మర్చంట్ బ్యాంక్‌లను ఎంపిక చేసింది. ఇందులో కొటాక్ మహీంద్రా బ్యాంక్, గోల్డ్‌మాన్ సాక్స్, జెపి మోర్గాన్ చాసే, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ తదితర విత్త సంస్థలు ఉన్నాయి.