Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆన్లైన్ విద్యా వేదిక ఇటిఎస్ ఇండియాను అధికారికంగా ఏర్పాటు చేసినట్లు గ్లోబల్ కంపెనీ ఇటిఎస్ వెల్లడించింది. భారత్లో తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు కార్యాలయం ఏర్పాటు చేయడంతో పాటుగా అభ్యాసకులకు తమ జీవితాంతపు విద్యా ప్రయాణంలో సేవలనూ అందించనున్నామని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇటిఎస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా లెజో శామ్ ఊమ్మెన్ను నియమించినట్లు తెలిపింది. భారతదేశపు విద్యా సమాజానికి మద్దతునందించడానికి ఇటిఎస్ కట్టుబడి ఉందని పేర్కొంది.