Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ది అడ్వాన్స్ డ్ మెడికల్ టెక్నాలజీ అసోసియేషన్ (అడ్వామెడ్) భారతదేశంలో ఆరోగ్యరంగ నిపుణులతో ఇంటరాక్షన్స్ కు సంబంధించి నైతిక నియమావళి అడ్వామెడ్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ను ఆవిష్కరించింది. వ్యాపార సంబంధాలు, కార్యకలాపాలకు వర్తించే విధంగా కీలక లీగల్ రిస్క్ విభాగాలకు సంబంధించి పాటించాల్సిన సూత్రాలు, మార్గదర్శకాలు ఇందులో ఉంటాయి. ఇది మెడికల్ టెక్నాలజీ, డయాగ్నస్టిక్ తయారీ దారులకు సంబంధించింది. వినూత్నత, చదువు, సమగ్రత, గౌరవం, బాధ్యత, పారదర్శకతలకు సంబంధించి కోడ్ విలువలకు అనుగుణంగా సహేతుక, తగిన నిర్ణయాలను తీసుకోవడంలో కంపెనీలకు తోడ్పడడం దీని ఉద్దేశం. శిక్షణ, క్లినికల్ రీసెర్చ్ లకు సంబంధించి మెడ్ టెక్ రంగం అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆయా అంతరాలను తొలగించడం, ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడం అడ్వామెడ్ కోడ్ ఆశయం.
ఈ సందర్భంగా అడ్వా మెడ్ గ్లోబల్ స్ట్రాటజీ అండ్ అనాలిసిస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అబ్బే ప్రాట్ మాట్లా డుతూ, ‘‘అంతర్జాతీయంగా, భారతదేశంలో వైద్య ఉపకరణాల సంస్థలు వైద్య శాస్త్రంలో ఆధునికతను అందించేందుకు, అధిక నాణ్యతను వృద్ధి చేయడం, వినూత్న వైద్య సాంకేతికత, రోగి సంరక్షణను మెరుగు పర్చడం లాంటి అంశాలకు కట్టుబడి ఉన్నాయి. అన్ని కంపెనీలకు కూడా ఈ నియమావళి, రోగి సురక్షిత, సమగ్రతలకు వీలు కల్పిస్తూ అవి తమ కార్యకలాపాల ఆశయాలకు సాధించడంలో ఒక ఆవశ్యక మార్గద ర్శకంగా పని చేస్తుంది. చిన్న, మధ్యతరహా, పెద్ద సంస్థలతో సహా అన్ని సంస్థలు, ఈ రంగంలో ఉన్న రిప్రజెంటేటివ్ లు అంతా కూడా ఈ నియమావళిని పాటించాల్సిందిగా మేం కోరుతున్నాం. ఈ నియమావళి ఆరోగ్యసంరక్షణ వృత్తినిపుణులతో ఇంటరాక్షన్స్ ను ప్రామాణీకృతం చేయడం మాత్రమే గాకుండా, యావత్ పరిశ్రమకు మేలు కలిగించే విధంగా ఆరోగ్యదాయక మెడిటెక్ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ ను నిర్వహించడంలో తోడ్పడుతుంది’’ అని అన్నారు.
అడ్వామెడ్ ఇండియా కోడ్ అనేది భారతదేశంలో మెడ్ టెక్ పరిశ్రమలో మరింత స్థిరత్వాన్ని సాధించేందుకు గాను అడ్వా మెడ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ సిఫారసులకు స్పందనగా అభివృద్ధి చేయబడింది. బిడి ఎండీ (ఇండియా, సౌత్ ఏషియా) పవన్ మోచెర్ల ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘అడ్వామెడ్ ఇండి యా కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనేది భారతదేశంలో వ్యాపార కార్యకలాపాల నైతికతకు సంబంధించి అత్యున్నత ప్రమాణాలను నిర్దేశించింది. భారత ప్రభుత్వంతో కలసి పని చేసేందుకు, దేశంలో మెడ్ టెక్ రంగాన్ని పటి ష్ఠం చేసేందుకు తమ అనుభవాన్ని ఉపయోగించేందుకు అడ్వామెడ్, దాని సభ్యులు కట్టుబడి ఉన్నారు. ఈ రంగానికి సంబంధించి ఇది తన సొంత కోడ్ ను అభివృద్ధి చేసుకోగలదనేందుకు ఈ నియమావళి ఒక ఉ దాహరణగా నిలిచింది. వృత్తిపరంగా, సాంస్కృతిక పరంగా దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇది రూ పొందించబడింది. స్థానిక అవసరాలకు అనుగుణంగా, అమలు చేయగలిగే విధంగా ఇది ఉంది. భారత దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వైద్య సాంకేతిక సంస్థలన్నీ కూడా దీన్ని అమలు చేయాలని కోరు తున్నాను’’ అని అన్నారు.
(1) నైతిక విధానాల అమలును ప్రోత్సహించేలా సంస్థాగత సంస్కృతిని నెలకొల్పడం, వర్తించే చట్టాలు, మార్గదర్శకాలు, నియమావళిలకు కట్టుబడి ఉండడం
(2) అనుచిత ప్రవర్తనలను గుర్తించడం, నిరోధించడం
అనే లక్ష్యాలతో రూపుదిద్దుకున్న ఈ నియమాళిని అనుసరించాల్సింగా ఆయా సంస్థలను కోరడమైంది.