Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ (ఎన్ఐఎంఎఫ్)కు చెందిన ఎస్సెట్ మేనేజర్ నిప్పాన్ లైఫ్ ఇండియా ఎస్సెట్ మేనేజ్మెంట్ (నామ్ ఇండియా) తాము నిప్పాన్ ఇండియా తైవాన్ ఈక్విటీ ఫండ్‌ను నవంబర్ 22,2021 న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఫండ్, తైవాన్ దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంతో భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. నిప్పాన్ ఇండియా తైవాన్ ఈక్విటీ ఫండ్ ప్రధాన పెట్టుబడి లక్ష్యం దీర్ఘకాలపు మూలధన వృద్థిని మదుపరులకు అందించడం. ప్రధానంగా తైవాన్ స్టాక్ ఎక్సేంజ్‌లో లిస్ట్ అయిన ఈక్విటీ సెక్యూరిటీలలో ఇది పెట్టుబడి పెడుతుంది. మల్టీ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహాన్ని ఇది అనుసరిస్తుంది. దీని పోర్ట్‌ఫోలియోలో వృద్ధి, వాల్యూ స్టాక్స్ భాగంగా ఉంటాయి. ఈ ఫండ్ ప్రధానంగా నూతన సాంకేతిక ధోరణులపై దృష్టి సారిస్తుంది. ఒకే స్టాక్‌లో 10% కన్నా తక్కువ పెట్టుబడిని ఇది పెడుతుంది.
ఈ ఎన్ఫ్ఓ నవంబర్ 22,2021 వ తేదీన సబ్‌స్ర్కిప్షన్ కోసం తెరుస్తారు. డిసెంబర్ 06,2021న మూసివేస్తారు. తైవాన్ క్యాపిటలైజేషన్ వెయిటెడ్ స్టాక్ ఇండెక్స్‌కు ఇది బెంచ్‌మార్క్ చేయబడింది. కనీసం 500 రూపాయలు ఆపైన ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఫండ్‌ను కింజాల్ దేశాయ్ నిర్వహిస్తారు. నిప్పాన్ ఇండియా ఈడీ అండ్ సీఈవో నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ మాట్లాడుతూ ‘‘క్యాథీ సైట్‌తో నిప్పాన్ ఇండియా తైవాన్ ఈక్విటీ ఫండ్‌ను భారతదేశ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఎస్సెట్ మేనేజర్‌గా నిలువాలనే లక్ష్యంతో విడుదల చేశాం. నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ గ్లోబల్ నెట్‌వర్క్‌తో భాగస్వామ్యం ద్వారా పలు ఉత్పత్తులు విడుదల చేయనున్నాం’’ అని అన్నారు
ఆండా చాంగ్, ప్రెసిడెంట్ అండ్ సీఈవొ– క్యాథీ సైట్ మాట్లాడుతూ ‘‘ భారతదేశంలో మొట్టమొదటి తైవనీస్ ఈక్విటీ ఫండ్‌ను భారతదేశంలో విడుదల చేయడం పట్ల ఆనందంగా ఉన్నాం. ఈ భాగస్వామ్యం ద్వారా విడుదల చేయబోయే ఎన్నో ఉత్పత్తుల ద్వారా భారతీయ నగదును తైవాన్‌కు తీసుకురావడంతో పాటుగా భారతీయ ఉత్పత్తులను తైవాన్‌లో విడుదల చేయనున్నాం’’ అని అన్నారు.