Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : భవిష్యత్తులో ఆర్బిఐ నిర్వహించనున్న ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్లను పెంచే అవకాశాలున్నాయని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. వచ్చే డిసెంబర్లో జరిగే ద్రవ్య సమీక్షలో తొలుత రివర్స్ రెపో రేటును పెంచే వీలుందని మోర్గాన్ స్టాన్లీ ఆర్థికవేత్తలు ఉపాసన, గంభీర్‌లు పేర్కొన్నారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో జరిపే సమీక్షలోనూ పెంచొచ్చని అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం జిడిపి కనీసం 7.8 శాతంగా, గరిష్ఠం 8.6 శాతంగా ఉండొచ్చన్నారు. తర్వాత ఏడాదిలో ఇది 7.2 శాతం- 7.9 శాతానికి పడిపోవచ్చని విశ్లేషించారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోన్న నేపథ్యంలో ఆర్బిఐ వడ్డీ రేట్ల పెంపును చేపట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.