Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : ప్రస్తుత ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ కాలంలో గహ విక్రయాలు 12 శాతం పెరిగి 1,38,051 యూనిట్లకు చేరాయని ప్రాప్‌టైగర్ డాట్ కామ్ తెలిపింది. గతేడాది ఇదే కాలంలో 1,233,725 యూనిట్ల విక్రయం జరిగిందని పేర్కొంది. ఈ సంస్థ బుధవారం వెల్లడించిన రియల్ ఇన్సైట్ రెసిడెన్షియల్ రిపోర్ట్‌లో ''డిమాండ్ పెరగడంతో పాటుగా పండుగ విక్రయాలు పెరగడం, భారతీయ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకోవడంతో పాటుగా ఉద్యోగ మార్కెట్ సైతం కోలుకోవడం, వడ్డీరేట్లు తగ్గడం తదితర పరిణామాలు అమ్మకాలకు మద్దతునిచ్చాయి' అని తెలిపింది.