Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ బుధవారం అధికారికంగా తమ లీజింగ్, సబ్స్క్రిప్షన్ వ్యాపారం క్విక్లీజ్ను ఆవిష్కరించింది. దీంతో కారు యాజమాన్య పరంగా ఎలాంటి అవరోధాలు లేకుండా కొత్త కారును సొంతం చేసుకోవచ్చని.. రిజిస్ట్రేషన్, బీమా, కారు నిర్వహణ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి అంశాలను క్విక్లీజ్ చూసుకుంటుందని తెలిపింది. ఈ బి2బి విభాగంలో కార్పోరేట్, ఫ్లీట్ యజమానులకు ఈ సేవలను అందించనున్నట్లు ఆ కంపెనీ హెడ్ రమేష్ అయ్యర్ తెలిపారు.