Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ యమహా ఇండియా ఆర్15 వి3 నూతన వర్షన్‌ను సింగిల్ సీట్‌తో యూనిబాడీని ఆవిష్కరించింది. రేసింగ్ బ్లూ రంగులో లభించే దీని ఎక్స్‌షోరూం ధరను రూ 1.57,600గా నిర్ణయించింది. ఆర్15 వి3 వేరియంట్ 155సిసి, 4-స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్ వంటి ఫీచర్లు దీని ప్రత్యేకతని యమహా మోటార్ ఇండియా గ్రూప్ చీఫ్ షిటరా తెలిపారు. ఆర్15 రేసింగ్ డిఎన్ఎతో రాజీపడకుండా అందుబాటు ధరలో బైక్‌ను అందించాలనే లక్ష్యంతో ఈ మోడల్‌ను ఆవిష్కరించామన్నారు.