Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగదు చెలామణిపై నిరాకరణ
ముంబయి : దేశంలో క్రిప్టో కరెన్సీని ఆస్తిగా మాత్రమే అనుమతించే అంశంపై కేంద్రం ఆసక్తిగా ఉందని సమాచారం. అయితే దీన్ని నగదు చెలామణిగా నిరాకరించనుందని తెలుస్తోంది. వర్చూవల్ కరెన్సీ నియమ నిబంధనలకు సంబంధించి ప్రక్రియ తుది దశలో ఉందని పేరు చెప్పుకోవడానికి ఇష్టపడని ఓ ఉన్నతాధికారి తెలిపారు. దీనికి సంబంధించిన అంశాన్ని సెబీ పరిశీలిస్తుందని సమాచారం. క్రిప్టో కరెన్సీలు దేశ ఆర్ధిక స్థిరత్వానికి ఎనలేని ముప్పుగా పరిణమిస్తాయని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ మరోవైపు తాజాగా హెచ్చరించారు. మంగళవారం ఎస్బిఐ నిర్వహించిన బ్యాంకింగ్ సదస్సులో దాస్ మాట్లాడుతూ కరెన్సీలతో ముడిపడి ఉన్న అంశాలపై సమగ్ర చర్చ నిర్వహించాలన్నారు. అందులోని లోతుపాతులను సమూలంగా చర్చించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని రోజుల క్రితం వర్చూవల్ కరెన్సీపై ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. ఈ అంశంపై చర్చించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా క్రిప్టో కరెన్సీలపై నిషేధం అవసరం లేదని, నియంత్రిస్తే చాలన్న అభిప్రాయం ప్రకటించిన నేపథ్యంలో దాస్ భిన్నమైన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.