Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: మైహోమ్ శ్రేణి కింద తన నవీన గృహ పరిష్కారాల శ్రేణిని లీ మెరిడియన్‌లో సెయింట్-గోబైన్ ప్రారంభించింది. డిజైన్ ఐడియాల నుంచి ప్రత్యేక తయారీ, బిగింపు, విక్రయానంతర సేవల వరకూ గృహాలకు ఇవి పూర్తిస్థాయి పరిష్కారాలను అందిస్తాయి. ఈ శ్రేణి ద్వారా, గృహ యజమానుల అవసరాలకు పరిష్కారాలను అందించడం కంపెనీ లక్ష్యం. నివాసాలు మరియు గృహాల మార్కెట్ అతి పెద్ద విభాగం, మొత్తం భవన నిర్మాణ రంగంలో దీని వాటా 80%కి పైగా ఉంది. అనేక సంక్లిష్టతల వల్ల గృహ పరిష్కారాల మార్కెట్ అత్యంత చెదురుమదురుగా, గుర్తింపులేకుండా మిగిలిపోయింది, దీనివల్ల గృహ యజమానులకు తమ ఇళ్ళను తీర్చిదిద్దుకోవడం కష్టతరమైన పనిగా మారింది. పూర్తిస్థాయిలో మొత్తం ప్రక్రియను డిజిటలీకరించడం ద్వారా గృహ పరిష్కారాల మార్కెట్‌ను కెయింట్-గోబైన్ విప్లవీకరిస్తోంది.
నిలకడైన భవన నిర్మాణ పరికరాల్లో ఒక ప్రపంచవ్యాప్త లీడర్‌గా ఉన్న సెయింట్-గోబైన్ నాణ్యమైన డిజైన్లు, ఉత్పత్తులు, సేవల అందజేతలో ప్రసిద్ధి చెందింది. మా ఉనికికి గృహాలే కేంద్రస్థానంగా మారడంతో, “మై-హోమ్” అనే పూర్తి సరికొత్త భావన ద్వారా కిటికీలు, షవర్ క్యూబికల్స్, సీలింగ్స్ కిచెన్ & వార్డ్ రోబ్ షట్టర్స్, పైకప్పు ఉత్పత్తులు, అద్దాలతో సహా ఉత్పత్తుల కోసం వినియోగదారులకు పరిష్కారాలను సెయింట్-గోబైన్ అందిస్తోంది. ఒకే చోట మొత్తం పరిష్కారాల సముదాయాన్ని అందించడం ద్వారా అవరోధాలు లేని ఒక ప్రక్రియ సృష్టిని, అలాగే తుది-వినియోగదారు ఇంటి ముంగిటికే అత్యాధునిక ఉత్పత్తులు, పరిష్కారాలను అందించడాన్ని సెయింట్-గోబైన్ లక్ష్యంగా చేసుకుంది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో రానున్న మైహోమ్ స్టోర్స్ లో ఉత్పత్తుల ప్రత్యక్ష అనుభవాన్ని వినియోగదారులు పొందవచ్చు, భారతదేశవ్యాప్తంగా ఉత్పత్తుల శ్రేణిని ప్రదర్శించే అనేక స్టోర్స్ లలో ఇది ఒకటి.
మైహోమ్ ప్రారంభోత్సవంలో భాగంగా, తన యుపివిసి విండోస్ కలెక్షన్‌ను, అలాగే షవర్ క్యూబికల్స్ ను సెయింట్-గోబైన్ విడుదల చేసింది. రూ.100 కోట్లకు పైగా పెట్టుబడితో అభివృద్ధి చేసిన సెయింట్-గోబైన్ వారి అత్యున్నత ఆటోమేటెడ్, డిజిటలైజ్డ్ తయారీ ప్లాంట్‌లో ఈ ఉత్పత్తులు తయారయ్యాయి. పరిష్కారాలు పూర్తిగా వ్యక్తిగతీకరించి ఉంటాయి- వినియోగదారులు తమ ఇంటి కళాత్మకతతో సరిపోయే భిన్నమైన ఉత్పత్తుల రకాలు, సైజులు, మెరుగులు, ఉపకరణాల వైవిధ్యాలు మరియు సమ్మేళనాల నించి ఎంపిక చేసుకోవచ్చు. సెయింట్-గోబైన్ కిటికీలు గ్లాస్, ప్రొఫైల్స్, హార్డ్ వేర్, ఇంటి గడపల కొలతలు & బిగింపులతో కూడిన పూర్తి సమగ్ర ఉత్పత్తులను భారతదేశంలో తొలిసారిగా అందిస్తున్నాయి. యూరోపియన్ ఇంజనీరింగ్, డిజైన్‌తో తయారైన కిటికీలు కేవలం సొగసైనవీ, చిరకాల మన్నిక కలవి మాత్రమే కాదు, వినియోగంలో శ్రమ లేనివి కూడా. షవర్ క్యూబికల్స్ శ్రేణి కూడా గడప కొలతలు, బిగింపులతో పాటు గ్లాస్, హార్డ్ వేర్‌తో కూడిన పూర్తి సేవలతో కలిసి ఉంటాయి. అవి ఏ సైజు లేదా ఆకారంలో ఉన్న స్నానాల గదికైనా సరిపడేలా 500+ డిజైన్ల ఎంపికలతో అందుబాటులో ఉంటాయి.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సెయింట్-గోబైన్ ఇండియా హేమంత్ ఖురానా మాట్లాడుతూ “భారతదేశంలో సెయింట్-గోబైన్‌కు గృహాల విభాగం ఒక గణనీయమైన అవకాశాన్ని అందిస్తోంది. మార్కెట్ పరిమాణం 25 బిలియన్ డాలర్లకు పైబడి ఉండడం, 8-10% సిఎజిఆర్ వద్ద వృద్ధి చెందుతూ ఉండడం వల్ల ఇంకా సంభవించని భారీ పట్టణీకరణ ఈ వృద్ధి మరింత వేగంగా సాగడానికి దోహదం చేస్తుంది. మనకి పట్టణీకరణ కేవలం 32% మాత్రమే జరిగింది, ఇది చైనాలో 62%గా ఉంది. అన్నిటిన్నా ప్రజలకు ఒక ఇల్లు అవసరం, సొంత ఇంటి అవసరాన్ని కరోనా మరింత తీవ్రతరం చేసింది. ప్రజలు పెద్ద ఇళ్ళను కొనుగోలు చేస్తున్నారు, తమ ఇళ్ళ మీద ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. మా గృహ పరిష్కారాల పోర్ట్ పోలియోని పెంచడానికి మా ప్రయత్నాలను తీవ్రతరం చేస్తున్నాం, అలాగే భారీ క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా గృహయజమానుల ముంగిటికే ఈ పరిష్కారాలను తీసుకువెళ్తున్నాం. ఒక అద్భుతమైన టచ్-అండ్-ఫీల్ అనుభవాన్ని అందించడం కోసం దేశంలోని ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాల్లో 2021 చివరికల్లా 50+ మైహోమ్ స్టోర్స్ ప్రారంభిస్తున్నాం. వచ్చే 3 నుంచి 5 సంవత్సరాల్లో గృహ పరిష్కారాల వ్యాపారం ద్వారా రూ. 1,000 కోట్ల ఆదాయాన్ని సృష్టించాలని మాకు మేము లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. ఈ దిశగా, మా వినియోగదారుల టచ్‌పాయింట్స్ నిర్మాణంలో, మైహోమ్ స్టోర్స్ ప్రారంభంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాం. మేం ఇప్పటికే చెన్నై, కొచ్చి, ముంబాయిల్లో స్టోర్స్ ప్రారంభించాం, ఇక్కడ హైదరాబాద్‌లో కూడా ప్రారంభిస్తున్నాం. గృహ, నిర్మాణ రంగంలో 2022-2023 ఆర్థిక సంవత్సరాల మధ్య భారతదేశంలో రూ. 2,500 కోట్లకు పైగా సెయింట్-గోబైన్ పెట్టుబడి పెడుతుంది” అని చెప్పారు.
శ్రీహరి కె, బిజినెస్ హెడ్, సెయింట్-గోబైన్ ఇండియా మాట్లాడుతూ “తుది వినియోగదారులకు శ్రేయస్సును అందించడంపై మేము దృష్టి పెడుతున్నాం, మా ప్రయాణంలో ఈ ప్రారంభోత్సవం ఒక ముఖ్యమైన మైలురాయి. మేము అనేక నవీన పరిష్కారాలను, ఒక వినూత్నమైన గో-టు-మార్కెట్‌ను అభివృద్ధి చేశాం. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న మైహోమ్ బ్రాండ్ స్టోర్‌లో కిటికీలు మరియు షవర్ క్యూబికల్స్, వార్డ్ రోబ్స్, కిచెన్ క్యాబినెట్ల షట్టర్లు, ఎల్ఇడి అద్దాలు తదితరాల్లాంటి ఇతర మైహోమ్ పరిష్కారాల ప్రత్యేక్ష అనుభవాన్ని వినియోగదారులు పొందవచ్చు” అని చెప్పారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్కిటెక్ట్ లు/ ఇంటీరియర్ డిజైనర్లు, అలాగే రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమకు చెందిన ప్రముఖ వ్యక్తులు పాల్గొన్నారు. ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ బిజు కురియకోస్ చేసిన ప్రధాన ఉపన్యాసం పాల్గొన్నవారిని ఆకట్టుకుంది. 355 సంవత్సరాలుగా రూపాంతరీకరణ చెందుతున్న, 72 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సెయింట్-గోబైన్ గ్రూప్ వరల్డ్ వైడ్లో సెయింట్-గోబైన్ ఇండియా ఒక భాగం. నివాస, వాణిజ్య & పారిశ్రామిక అనువర్తనల్లో ఉపయోగించే అత్యున్నత పనితీరు కలిగిన మెటీరియల్స్, పరిష్కారాలను సెయింట్-గోబైన్ డిజైన్ చేస్తుంది, రూపొందిస్తుంది, పంపిణీ చేస్తుంది.