Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాంప్లిట్యూడ్ విడుదల చేసిన నెక్స్ట్ హాటెస్ట్ డిజిటల్ ఉత్పత్తులు
- నివేదికలో Koo యాప్ US, EMEA, APAC ప్రాంతాలలో ఉన్న ఏకైక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్
హైదరాబాద్: యాంప్లిట్యూడ్ విడుదల చేసిన మొదటి ఉత్పత్తి నివేదిక 2021 ద్వారా ఆసియా పసిఫిక్ (APAC) ప్రాంతం నుండి తదుపరి 5 హాటెస్ట్ ఉత్పత్తులలో Koo యాప్ - భారతదేశం యొక్క బహుళ-భాషా మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఒకటిగా ర్యాంక్ చేయబడింది. Koo App – వినియోగదారులు తమ మాతృభాషలో తమ భావాలను వ్యక్తీకరించడానికి సాధికారత ఇచ్చే ఒక ప్రత్యేకమైన ప్లాట్‌ఫారమ్, ఈ ప్రతిష్టాత్మక నివేదికలో APAC, US, EMEA అంతటా రేట్ చేయబడిన ఏకైక సోషల్ మీడియా బ్రాండ్ Koo యాప్. భారతదేశానికి చెందిన రెండు బ్రాండ్లలో Koo యాప్ ఒకటి (CoinDCX మరొకటి) గా ప్రస్తావించబడినవి.
యాంప్లిట్యూడ్ యొక్క బిహేవియరల్ గ్రాఫ్ నుండి వచ్చిన డేటా మన డిజిటల్ జీవితాలను రూపొందించే ప్రపంచవ్యాప్తంగా హాటెస్ట్ ఎమర్జింగ్ డిజిటల్ ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. ఈ నివేదిక కూ యాప్‌ను "భారతీయ వినియోగదారులకు ఒక ప్రతియేకమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్"గా వివరిస్తుంది. కూ "1 బిలియన్ కంటే ఎక్కువ మంది బలమైన కమ్యూనిటీకి ఎంపిక చేసుకునే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌గా మారడానికి సిద్ధంగా ఉంది" అని ఇది పేర్కొంది. స్థానిక భాషలలో వ్యక్తీకరణ కోసం మేడ్-ఇన్-ఇండియా ప్లాట్‌ఫారమ్‌గా, Koo యాప్ మార్చి 2020లో ప్రారంభించినప్పటి నుండి 20 నెలల స్వల్ప వ్యవధిలో 15 మిలియన్లకు పైగా వినియోగదారులను సంపాదించుకుంది మరియు తొమ్మిది భారతీయ భాషలలో సేవలను అందిస్తుంది. బలమైన సాంకేతికతలు మరియు వినూత్న భాషా అనువాద లక్షణాలతో, కూ రాబోయే ఒక సంవత్సరంలో 100 మిలియన్ డౌన్లోడ్లను దాటుతుందని భావిస్తున్నారు. ది ప్రోడక్ట్ రిపోర్ట్ 2021కి ప్రతిస్పందిస్తూ, కూ, కో-ఫౌండర్ & సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ, “ఈ గౌరవనీయమైన గ్లోబల్ రిపోర్ట్‌లో Koo యాప్ కు గుర్తింపు పొందడం, APAC నుండి టాప్ 5 హాటెస్ట్ డిజిటల్ ఉత్పత్తులలో ఒకటిగా ర్యాంక్ పొందడం పట్ల మేము సంతోషిస్తున్నాము. ప్ భారతదేశం మరియు APAC, EMEA ఇంకా US నుంచి మేము ఏకైక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ గా గుర్తింపబడ్డాము . భారతదేశం నుండి ప్రపంచం కోసం నిర్మించబడుతున్న బ్రాండ్‌గా ఇది మాకు గొప్ప విజయం. యాంప్లిట్యూడ్ ద్వారా ఈ ర్యాంకింగ్ డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌లో భాషా అడ్డంకులను తొలగించడానికి, వారి సంస్కృతులు, భాషా వైవిధ్యంతో సంబంధం లేకుండా ప్రజలను కనెక్ట్ చేయడానికి మరింత కష్టపడి పనిచేయడానికి మమ్మల్ని ప్రేరేపిస్తుంది.
యాంప్లిట్యూడ్ అనేది కాలిఫోర్నియాలో ఉన్న ఉత్పత్తి విశ్లేషణలు, డిజిటల్ ఆప్టిమైజేషన్ సంస్థ. ఈ నివేదిక 'త్వరగా అభివృద్ధి చెందుతున్న ఉత్పత్తులను' సమగ్ర నెలవారీ వినియోగదారు డేటాను విశ్లేషించి ప్రపంచంలోని నెక్స్ట్ హౌసేహోల్డ కంపినీలను గుర్తించింది. గొప్ప డిజిటల్ అనుభవం ద్వారా నిర్వచించబడిన కంపెనీలను, జూన్ 2020 నుండి జూన్ 2021 వరకు 13 నెలల వ్యవధిలో మొత్తం నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్యలో ఘాతాంక వృద్ధిని ప్రదర్శించిన కంపెనీలను యాంప్లిట్యూడ్ పరిగణించింది.