Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరంగల్: తాము తెలంగాణాలోని రైడర్లు, డ్రైవర్లుకు సేవలనందించడం ప్రారంభించామని ఉబెర్ నేడు వెల్లడించింది. తద్వారా భారతదేశ వ్యాప్తంగా 100 నగరాలలో కంపెనీ కార్యకలాపాలను విస్తరించినట్లయింది. తొలుత, తమ వేదికపై పలు రకాల ఆటో, కారు ఉత్పత్తులను నగరంలో అందుబాటులో ఉంచింది. ఉబెర్ తమ కార్యకలాపాలను భారతదేశంలో 2013లో ప్రారంభించింది. అతి స్వల్పకాలంలోనే అది ప్రాధాన్యతా రైడ్ షేరింగ్ వేదికగా మారడంతో పాటుగా సౌకర్యవంతమైన, అందుబాటు ధరలోని, సురక్షితమైన మార్గంను పాయింట్ ఏ నుంచి పాయింట్ బీ కు అందిస్తుంది. అప్పటి నుంచి, ఇప్పటి వరకూ ఇది దాదాపు 95 మిలియన్ల మంది రైడర్లు, డ్రైవర్లకు దేశవ్యాప్తంగా సేవలనందించింది. పరిశ్రమలో తొలిసారిగా రెంటల్స్, ఉబెర్ కనెక్ట్, ఆటో, మోటో వంటి ఉత్పత్తులతో పాటుగా డ్రైవర్ టిప్పింగ్, 24 గంటల సేఫ్టీ హెల్ప్‌లైన్, కాల్ ఎనోనిమైజేషన్, మరెన్నో ఉబెర్ తమ వేదికపై విడుదల చేసింది. ఉబెర్ కోసం అసాధారణ అవకాశాలను ఇండియా అందించింది. అందుబాటు ధరలలో విభిన్నమైన ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలను అందిస్తుంది. ఈ కంపెనీ ఇప్పుడు 200 నగరాలకు తమ కార్యకలాపాలను విస్తరించాలనే లక్ష్యంగా చేసుకుంది.
ఉబెర్ ఈ మైలురాయి చేరుకోవడం గురించి తెలంగాణా రాష్ట్ర పురపాలిక వ్యవహారాలు, నగరాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, వాణిజ్య శాఖామాత్యులు కె టీ రామారావు మాట్లాడుతూ ‘‘వరంగల్ ప్రాంత ప్రజల కోసం అత్యంత కీలకమైన రైడ్ షేరింగ్ సేవలను ప్రారంభించడం పట్ల ఉబెర్‌కు ధన్యవాదములు తెలుపుతున్నాము. స్మార్ట్ సిటీ నగరాల నిర్మాణంలో అతి సులభమైన, స్మార్ట్ మొబిలిటీ పరిష్కారాలతో పాటుగా ఈ తరహా ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యాలు అత్యంత కీలకం. కాజీపేట, హనుమకొండ, వరంగల్ నగరాల నడుమ మెరుగైన కనెక్టివిటీ నిర్మించడంలో అత్యంత కీలకం ఇది కానుంది. అదే రీతిలో రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్ నడుమ తుది మైలు కనెక్టివిటీకి సైతం తోడ్పడుతుంది’’ అని అన్నారు. ఈ మైలురాయి చేరుకోవడం పట్ల శివ శైలేంద్రన్, హెడ్ ఆఫ్ సిటీస్ ఆపరేషన్స్, ఉబెర్ ఇండియా అండ్ సౌత్ ఆసియా మాట్లాడుతూ ‘‘భారతదేశంలో 100వ నగరంలో మా కార్యకలాపాలను ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఉబెర్ వద్ద, కమ్యూనిటీలు మాకు అత్యంత కీలకం. గత ఎనిమిది సంవత్సరాలలో భారతదేశంలో మేము సాధించిన విజయం పట్ల గర్వంగా ఉన్నాము. గత కొద్ది సంవత్సరాలుగా, కోట్లాది రైడ్స్, డెలివరీలకు తగిన శక్తిని అందించడం ద్వారా ప్రపంచం ప్రయాణించే తీరును సమూలంగా మార్చాము. కోట్లాది మంది రైడర్లు, వ్యాపారాలు, డ్రైవర్లు, కొరియర్లను ప్రపంచవ్యాప్తంగా మరెవరూ కలుపలేని రీతిలో అనుసంధానించాము. ప్రపంచ, భారతీయ మార్కెట్ కోసం మా కస్టమర్ –ఫస్ట్ ఉత్పత్తులను అభివృద్ధి చేయడం ద్వారా సాంకేతికత, ఉత్పత్తి ఆవిష్కరణల సహాయంతో మేము కంపెనీ విజయాన్ని మరింతగా వృద్ధి చేయడాన్ని లక్ష్యంగా చేసుకున్నాము. భారతదేశంలో మా ప్రయాణం ఇప్పుడే ఆరంభమైంది. రాబోయే సంవత్సరాలలో మరిన్ని మైలురాళ్లను అధిగమించనున్నాము’’ అని అన్నారు
మహమ్మారి నేపథ్యంలో UberMedic, Uber Essential, Last Mile Delivery వంటి సేవలను ఆవిష్కరించడంతో పాటుగా free rides to healthcare వర్కర్లు, అపాయంలో ఉన్న ప్రజలకు ఉచిత సవారీలు అందించడంతో పాటుగా ఈ సంవత్సర ఆరంభంలో, లాక్డౌన్లో ఏది ముఖ్యమో (#MoveWhatMatters)అది అందించింది. భారతదేశం మరింతగా ముందుకు వెళ్లేందుకు తోడ్పడటానికి సహాయపడటానికి సహాయపడాలనే ఉబెర్ నిబద్ధతలో భాగంగా pledged free rides worth INR 10 Cr భారత ప్రభుత్వానికి ఉచితంగా అందించడానికి ఉబెర్ ప్రతిజ్ఞ చేయడంతో పాటుగా ఇతర సుప్రసిద్ధ ఎన్జీవోలు అయినటువంటి HelpAge India, Robin Hood Army, అమెరికన్ ఇండియా ఫౌండేషన్, UNESCO వంటి వాటికి సహాయపడటం ద్వారా వ్యాక్సిన్ లబ్ధిదారులకు రవాణా ఓ అవరోధం కాకుండా నిలిపింది.
ఏప్రిల్ 2021లో compensating drivers వ్యాక్సినేషన్లకు మద్దతునందించేందుకు ఉబెర్ ప్రత్యేకంగా ఓ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. దీని ద్వారా వారు టీకా తీసుకోవడానికి వెచ్చించిన సమయానికి తగిన ప్రతిఫలం అందించింది. నవంబర్ 2021 నాటికి దాదాపు 3 లక్షల మంది డ్రైవర్లు ఉబెర్ ప్లాట్‌ఫామ్‌పై కనీసం ఓ మోతాదు వ్యాక్సిన్ అయినా పొందారు.