Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ స్కోడా గురువారం భారత మార్కెట్లోకి స్వావ్యాను విడుదల చేసింది. ఐదు రంగుల్లో ఆవిష్కరించిన ఈ మోడల్‌కు బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. ఐదు డోర్లు, రెండు ఇంజిన్లు, ఆరు ఎయిర్ బ్యాగ్‌లు దీని ఫీచర్లుగా ఉన్నాయి. 2025 నాటికి భారత మార్కెట్లో 5 శాతం మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్కోడా ఆటో మేనేజింగ్ డైరెక్టర్ గుర్ప్రతాప్ బోపరాయి తెలిపారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి స్వావ్యా దోహదం చేయనుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా దీని ధరను ఆ కంపెనీ వెల్లడించలేదు.