Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ భారత్లో తన కార్యకలాపాలను 100 నగరాలకు విస్తరించినట్లు ప్రకటించింది. కొత్తగా వరంగల్లో తమ సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా ఈ మైలురాయిని చేరుకున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. దేశంలో 2013లో తమ కార్యకలాపాలను ప్రారంభించగా.. భవిష్యత్తులో 200 నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.