Authorization
Mon Jan 19, 2015 06:51 pm
• హెచ్‌పీ పే యాప్ ద్వారా హెచ్‌పీసీఎల్ రిటైల్ ఔట్లెట్స్ వద్ద ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ యొక్క ఫాస్టాగ్ వినియోగదారులు తమ చెల్లింపులను చేయవచ్చు
• ఐడీఎఫ్సీ ఫస్ట్ ఫాస్టాగ్ ను హెచ్‌పీసీఎల్ యొక్క ఎంపిక చేసిన రిటైల్ ఔట్లెట్ల వద్ద కొనుగోలు చేయడం, రీచార్జ్ చేయడం, భర్తీ చేయడం చేయవచ్చు.
ముంబై: హిందుస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్), ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ నేడు హెచ్‌పీసీఎల్ యొక్క రిటైల్ ఔట్లెట్ల వద్ద ఇంధన చెల్లింపులను బ్యాంక్ యొక్క ఫాస్టాగ్స్ వినియోగించి చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి. అంతేకాదు, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ యొక్క ఫాస్టాగ్స్ ఇప్పుడు ఎంపిక చేసిన హెచ్‌పీసీఎల్ రిటైల్ ఔట్లెట్ల వద్ద కొనుగోలు చేయడం, రీచార్జ్ చేయడం, రీప్లేస్ చేయడం చేయవచ్చు. ఇప్పటి వరకూ ఫాస్టాగ్స్‌ను కేవలం టోల్ చార్జీల చెల్లింపుల కోసమే వినియోగిస్తున్నారు. గత సంవత్సరం, వాణిజ్య వాహనాల కోసం ఫాస్టాగ్ బ్యాలెన్స్‌ను వినియోగించి ఇంధన చెల్లింపులను డ్రైవ్ ట్రాక్ ప్లస్ పీఓఎస్ టర్మినల్స్ ద్వారా హెచ్‌పీసీఎల్ రిటైల్ ఔట్లెట్ల వద్ద చేయడాన్ని పరిచయం చేసింది. వినియోగదారుల నుంచి వచ్చిన సానుకూల స్పందనతో వ్యక్తిగత వాహన వినియోగదారులు సైతం ఇప్పుడు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ యొక్క ఫాస్టాగ్స్ ను ఇంధన కొనుగోలు కోసం హెచ్‌పీసీఎల్ రిటైల్ ఔట్లెట్ల వద్ద వినియోగించవచ్చు. తమ ఫాస్టాగ్ నిల్వలను ఉపయోగించి హెచ్‌పీ పే మొబైల్ అప్లికేషన్ ద్వారా చెల్లింపులను చేయవచ్చు.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, బీ మాధవన్ మాట్లాడుతూ ‘‘డిజిటల్ ఫస్ట్ బ్యాంక్‌గా, మా ప్రయత్నమెప్పుడూ కూడా రవాణా సంబంధిత చెల్లింపులను సరళంగా మార్చడం. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఇప్పటి వరకూ దాదాపు 5మిలియన్ల ఫాస్టాగ్‌లను జారీ చేశాము, దాదాపు రెండు మిలియన్ల లావాదేవీలు ప్రతి రోజూ వీటి ద్వారా చేస్తున్నాము. ఇప్పుడు హెచ్పీసీఎల్తో భాగస్వామ్యంతో మా వినియోగదారులు ఫాస్టాగ్ ద్వారా ఇంధన చెల్లింపులూ చేయగలరు’’ అని అన్నారు. సాయి కుమార్ సూరి, ఈడీ– రిటైల్, హెచ్‌పీసీఎల్ మాట్లాడుతూ ‘‘గత ఆర్థిక సంవత్సరంలో హెచ్‌పీసీఎల్ రిటైల్ ఔట్లెట్ల వద్ద ఫాస్టాగ్ ఆధారిత ఫ్యూయలింగ్ను మా లాయల్టీ ప్రోగ్రామ్ డ్రైవ్ట్రాక్ ప్లస్ ద్వారా తొలిసారిగా పరిచయం చేశాము. ఇప్పుడు హెచ్‌పీ పే మొబైల్ యాప్ ద్వారా ఐడీఎఫ్సీ బ్యాంక్ ఫాస్టాగ్‌ను పరిచయం చేశాము. అంతేకాదు, ఎంపిక చేసిన రిటైల్ ఔట్లెట్ల వద్ద ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌తో కలిసి ఫాస్టాగ్ మార్కెటింగ్ కార్యకలాపాలనూ ప్రారంభించాము’’ అని అన్నారు.