Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్జాతీయ విద్యార్థి ఋణాల కోసం రీఫి(refi ) ఉత్పత్తులను విడుదల చేసిన ఎంపవర్
నవతెలంగాణ బెంగళూరు: లక్ష్య ఆధారిత ఫిన్‌టెక్ సంస్థ, ప్రతిభావంతులైన అంతర్జాతీయ విద్యార్థులకు విద్యాఋణాలను అందించడానికి సంబంధించి అగ్రగామి సంస్థ ఎంపవర్ ఫైనాన్సింగ్, ఇప్పుడు అంతర్జాతీయ విద్యా ఋణ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ (రీఫి)ను యునైటెడ్ స్టేట్స్లో ఇప్పుడు పనిచేస్తున్న భారతీయ గ్రాడ్యుయేట్లకు ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించడం ద్వారా, ఎంపవర్ ఇప్పుడు అంతర్జాతీయంగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లకు తమ నూతన కెరీర్స్‌ను ఆర్థికంగా పూర్తి భరోసాతో ప్రారంభించవచ్చు. ఈ ఋణాల ద్వారా 1,00,000 డాలర్లను (దాదాపు 75 లక్షల రూపాయలు) విద్యాఋణాలుగా భారతీయ ఆర్థిక సంస్థల నుంచి విద్యార్థులు పొందవచ్చు. అదనంగా హామీ, తనఖా ఇబ్బందులను అధిగమించడంతో పాటుగా విజయవంతమైన అభ్యర్థులు తమ వడ్డీరేట్లను సైతం గణనీయంగా తగ్గించుకుంటూనే యుఎస్ ఋణ చరిత్రను సైతం నిర్మించుకోవచ్చు.
‘‘వేగవంతమైన మరియు సులభమైన ప్రక్రియ ద్వారా వారి విద్యాఋణాలను రీఫైనాన్సింగ్ చేసుకునే అవకాశం అందించి యుఎస్‌లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు తగిన తోడ్పాటునందించడం మా లక్ష్యం’’ అని అశ్విని కుమార్, జనరల్ మేనేజర్– ఎంపవర్స్ ఇండియా ఆఫీస్ అన్నారు. ‘‘ఇది కేవలం వడ్డీరేట్లను మాత్రమే గణనీయంగా తగ్గించడం కాదు, హామీదారుడు, తనఖా అవసరాల బంధాల నుంచి కూడా విముక్తిలవుతారు. తమ కుటుంబ వనరులపై భారం తగ్గించుకోవడం ద్వారా వారు తమ మానసిక ఒత్తిడిని సైతం గణనీయంగా తగ్గించుకోగలరు. అదనంగా, ఎంపవర్ ఇప్పుడు ఋణాలను తీసుకున్న వ్యక్తులు తమ యుఎస్ క్రెడిట్ చరిత్రను నిర్మించుకునే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా యుఎస్ ప్రభుత్వం అందించే పలు పన్ను రాయితీలను సైతం పొందవచ్చు. మిషన్ ఆధారిత కంపెనీగా ఎంపవర్ ఇప్పుడు క్లిష్టత లేని, సౌకర్యవంతమైన అనుభవాలను మా విద్యార్థులకు అత్యుత్తమ వడ్డీరేట్లు తో మా రీఫైనాన్సింగ్ కార్యక్రమంతో అందిస్తున్నాం’’ అని అన్నారు
‘‘ఎంతోమంది భారతీయ విద్యాఋణాలను ఎంపవర్ ద్వారా రీ ఫైనాన్స్ చేయగలగడం అతి పెద్ద ఉపశమనంగా నిలుస్తుంది’’ అని ఇటీవలనే రీఫీ పథకం వినియోగించుకున్న ఎంపవర్ యొక్క వినియోగదారులలో ఒకరైన అనికేత్ సిన్హా అన్నారు. ఆయనే మాట్లాడుతూ ‘‘ఫ్లోరిడా యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన నాటి నుంచి నేను ఎంచుకున్న కంప్యూటర్ సైన్స్‌లో అత్యద్భుతమైన ఉద్యోగాన్ని నేను పొందాను. అయినప్పటికీ, నా ఋణ చెల్లింపు పట్ల కాస్త ఆందోళనగానే ఉండేవాడిని. దీనితో పాటుగా మా అమ్మనాన్నలు ఋణాల కోసం వెదుకుతుండటమూ జరిగేది. ఎంపవర్‌తో, ప్రతి సంవత్సరం నేను వేలాది డాలర్లను ఆదా చేసుకోవడం మాత్రమే కాదు, పూర్తి మనశ్శాంతినీ పొందాను. ఇప్పుడు మా తల్లిదండ్రులు స్వేచ్ఛను అనుభవించడంతో పాటుగా నాకు హామీదారులుగా వారు భారాన్ని ఇక ఎంతమాత్రమూ మోయకుండా తమ రిటైర్మెంట్ జీవితంలోకి అడుగు పెడుతున్నారు’’ అని అన్నారు.
‘‘ఎంపవర్‌తో నా విద్యాఋణాలను రీఫైనాన్సింగ్ చేసుకోవడం వల్ల నా జేబులో మరింత డబ్బు పొందగలుగుతున్నాను. అంతేకాదు యుఎస్‌లో ఆర్థికంగా నేను స్వాలంభన పొందగలుగుతున్నాను’’ అని మరో ఎంపవర్ రీఫి వినియోగదారుడు రాహుల్ గుణశేఖరన్, అన్నారు. ‘‘నేను జార్జ్ మాసన్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశాను. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో అత్యుత్తమ ఉద్యోగాన్ని నేను పొందాను. మా తల్లిదండ్రులపై ఆర్థికంగా అసలు భారం ఉండకూడదని నేను కోరుకున్నాను. నా ఎంపవర్ లోన్ ఇప్పుడు ప్రతి సంవత్సరం వేలాది డాలర్లను ఆదా చేసుకునే అవకాశం అందిస్తుంది. అదే సమయంలో నేను మా తల్లిదండ్రుల ఆర్థిక అవసరాలనూ తీర్చగలిగే అవకాశమూ అందిస్తుంది’’ అని అన్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు తప్పనిసరిగా యుఎస్ లేదా కెనడా యూనివర్శిటీల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండటంతోపాటుగా కనీసం మూడు నెలల పాటు పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి. ఓపీటీ, హెచ్1–బీ మరియు ఇతరములు సహా విస్తృత శ్రేణిలో వర్క్ ఆథరైజేషన్స్ ఉండి ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎంపవర్ యొక్క వెబ్సైట్ వద్ద మరింతగా తెలుసుకోవడంతో పాటుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపవర్ యొక్క ఋణాలు, తనఖా లేని, హామీ లేని ఋణాలతో విద్యార్థులు ప్రయోజనం పొందడంతో పాటుగా కాంప్లిమెంటరీ క్రెడిట్ బిల్డింగ్, ఇమ్మిగ్రేషన్ గైడెన్స్, జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్‌ను ఎంపవర్ యొక్క పాత్2సక్సెస్ ప్రోగ్రామ్ ద్వారా పొందవచ్చు. లక్ష్యత ఆధారిత సంస్థగా, ఎంపవర్ ఇప్పుడు విద్యార్థులకు అందుబాటు ధరలలో ఋణాలను అందించడానికి కట్టుబడి ఉంది.