Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అమెజాన్ ఇండియా మహిళలే భాగస్వాములుగా నిర్వహిస్తున్న డెలివరీ స్టేషన్లను ఐదుకు పెంచినట్లు తెలిపింది. తాజాగా గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో కొత్త అమెజాన్ డెలివరీ సర్వీస్ పార్టనర్ (డిఎస్పి)ను ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం తమిళనాడు, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో ఇలాంటివి నాలుగు డెలివరీ స్టేషన్లు ఉన్నాయని తెలిపింది. లాజిస్టిక్స్ రంగంలో మహిళలకు అవకాశాలను వద్ధి చేసేందుకు అమెజాన్ ఇండియా చేస్తున్న ప్రయత్నాలను ఈ ఆల్ ఉమెన్ డెలివరీ స్టేషన్ మద్ధతు ఇస్తోందని అమెజాన్ ఇండియా లాస్ట్ మైల్ ఆపరేషన్స్ డైరెక్టర్ కరుణా శంకర్ పాండే తెలిపారు.