Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆన్లైన్ అభ్యాస, బోధనా వేదిక ట్యుటర్డ్ తన పోర్టల్లో వచ్చే మార్చి నాటికి 5వేల మంది ఉపాధ్యాయులను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 500 మంది పైగా బోధకులు ఉన్నారని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. తమ యాప్లో ఉపాధ్యాయులు తమ ఖాళీ సమయంలో ఆన్లైన్ తరగతులు నిర్వహించడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని ఆ సంస్థ సిఇఒ దివ్యతేజ్ పెరీరా పేర్కొన్నారు. విద్యార్థులు అధికంగా ఉండటం చేత వ్యక్తిగతీకరణ అనేది పాఠశాలలు, కాలేజీలకు పెనుసవాలుగా మారింది. ఈ ఆలోచనతోనే వ్యక్తిగతీకరించిన అభ్యాస అనుభవాల కోసం ట్యుటర్డ్ను ఏర్పాటు చేశామన్నారు.