Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ భవన నిర్మాణ పరికరాలు, గాజు ఉత్పత్తుల కంపెనీ సెయింట్ గోబైన్ కొత్తగా గృహ పరిష్కారాల కోసం 'మైహోమ్' స్టోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో డిజైన్ రూపకల్పనల నుంచి ప్రత్యేక తయారీ, బిగింపు, విక్రయానంతర సేవలు అందించనున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. కిటికీలు, షవర్ క్యూబికల్స్, సీలింగ్స్ కిచెన్, వార్డ్ రోబ్ షట్టర్స్, పైకప్పు ఉత్పత్తులు, అద్దాలతో సహా ఉత్పత్తుల కోసం వినియోగదారులకు పరిష్కారాలను అందించనున్నట్లు పేర్కొంది. త్వరలోనే మాదాపూర్‌లో రానున్న మైహోమ్ స్టోర్స్‌లో ఉత్పత్తుల ప్రత్యక్ష అనుభవాన్ని వినియోగదారులు పొందవచ్చని సెయింట్ గోబైన్ ఇండియా ఇడి హేమంత్ ఖురానా తెలిపారు. 2021 చివరి కల్లా దేశ వ్యాప్తంగా 50 స్టోర్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. వచ్చే 3 నుంచి 5 సంవత్సరాల్లో గహ పరిష్కారాల వ్యాపారం ద్వారా రూ.1,000 కోట్ల ఆదాయాన్ని సష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.