Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హార్పిక్ మిషన్ పానీ భారతదేశపు మొదటి 'శానిటేషన్ ఫర్ ఆల్ ప్లెడ్జ్ అండ్ ప్రియాంబుల్ : పరిశుభ్రమైన నీరు, సుస్థిరమైన పారిశుద్ధ్యం' ని ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం నాడు మిషన్ పానీ శానిటేషన్ ఫోరమ్ లో గౌరవనీయ జల్ శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ మరియు అయిదుగురు ప్రముఖ మహిళా నేతలు కౌసర్ మునీర్ (గీత రచయిత్రి), సవితా పునియా ( భారత హాకీ క్రీడాకారిణి), స్మృతి మంథాన (భారతీయ క్రికెటర్), భావినా పటేల్ (ఇండియన్ పార్ అథ్లెట్ మరియు టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి) మరియు లవ్ లినా బోరోహైన్ (భారతీయ బాక్సర్, ఒలంపియన్) తో ఆరంభించింది.
ఈ కార్యక్రమంలో గౌరవనీయ ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు మద్దతు ఇచ్చిన మొదటి రకం కాఫీ టేబుల్ పుస్తకం '101 స్టోరీస్ ఆఫ్ ఇన్ స్పిరేషన్ 'కూడా ఆవిష్కరించబడింది. భారతదేశంలో పారిశుద్ధ్య పనివారి ఆశ మరియు ప్రేరణా గాతల్ని ఈ పుస్తకం చూపిస్తుంది. పుస్తకాన్ని ఇంటిగ్రేటెడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ కౌన్సిల్ సంకలనం చేసింది. మన పరిశుభ్రత మరియు పారిశుద్ధ్య అవసరాలు గురించి సంరక్షణవహించడం ద్వారా పరిశుభ్రమైన మరియు మరింత ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా తమ జీవితాల్ని ఫణంగా పెట్టిన ఈ పనివారికి ఈ పుస్తకం ఒక నివాళి. మేన్యువల్ గా మల వ్యర్థాల్ని నిర్మూలించడం నుండి గౌరవప్రదమైన జీవనోపాధిగా తమ జీవితాల్ని పరివర్తనం చేసుకున్న వ్యక్తులు గురించి ఈ కథలు తెలియచేస్తాయి. స్వచ్ఛ్ భారత్ మిషన్ మరియు యూఎన్ వారి సస్టైనబుల్ డవలప్ మెంట్ గోల్స్ తో అనుసంధానం చెందిన, హార్పిక్ మిషన్ పానీ 'ఎవర్నీ వదలరాదు' లక్ష్యాన్ని నిర్థారించే చైతన్యం మరియు సమీకరణ చర్యని కలిగించే దిశగా పని చేయడానికి కట్టుబడింది. సమీకృత పారిశుద్ధ్యానికి భారతదేశపు మొదటి ఉపోద్ఘాతం పరిశుభ్రమైన మరియు ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని సృష్టించడానికి ఒక చోటకు కలిసికట్టుగా చేరే మన అవసరాన్ని బలోపేత్తం చేసే సమీకృత ఆవరణ వ్యవస్థని ఉమ్మడిగా ప్రచారం చేసే ఒక చర్య.
గౌరవ్ జైన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, దక్షిణ ఆసియా, రెకిట్ ఇలా వ్యాఖ్యానించారు, "రెకిట్ పోరాటం ఏమంటే, అత్యధిక నాణ్యత గల పరిశుభ్రత , సంక్షేమం మరియు పోషణని పొందడం ఒక హక్కుగా చేయడం కానీ ఒక్ ఏర్పాటుగా కాదు. నేడు, ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్భంగా, పేదరికాన్ని నిర్మూలించడానికి అవసరమైన నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యం ఏర్పాటుని పొందేలా వీలు కల్పించడానికి ఒక ఆవరణ వ్యవస్థని సృష్టించడానికి మేము మా నిబద్ధతని బలోపేత్తం చేస్తున్నాం. సురక్షితమైన నీరు మరియు పారిశుద్ధ్యానికి భారతదేశపు మొట్ట మొదటి ఉపోద్ఘాతాన్ని మద్దతు చేయడానికి వాగ్థానం కోసం మేము దేశాన్ని కలిసికట్టుగా ఒక చోటకు తీసుకువస్తున్నాం. సురక్షితమైన నీరు మరియు సురక్షితమైన మరుగుదొడ్లు అంటే ఆరోగ్యవంతమైన జాతి అని అర్థం; దేశాభివృద్ధి వ్యాఖ్యానంలో ఇది అత్యంత కీలకమైన మనుష్యుల హక్కుల అంశాల్లో ఒకటిగా తప్పనిసరిగా తలెత్తాలి”.
ప్రముఖ గీత రచయిత్రి కౌసర్ మునీర్ రాసిన పారిశుద్ధ్య వాగ్థానం అందరి కోసం పరిశుభ్రమైన నీరు మరియు పారిశుద్ధ్యం పొందడాన్ని నిర్థారించడానికి అన్ని వర్గాలకు చెందిన ప్రజల్ని ఒక చోట చేర్చే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఈ వాగ్ధానానికి జల్ జీవన్ మిషన్ మరియు స్వచ్ఛ్ భారత్ మిషన్ లు మద్దతు ఇచ్చాయి.
అక్షయ్ కుమార్, నటుడు మరియు మిషన్ పానీ కాంపైన్ అంబాసిడర్ ఇలా అన్నారు, “గత కొద్ది సంవత్సరాలలో, భారతదేశం పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంలో వేగవంతమైన ప్రగతిని సాధించింది మరియు దేశవ్యాప్తంగా బహిరంగ మల విసర్జనని అంతం చేసింది. కానీ ఇప్పటికీ గణనీయమైన జనాభాకి పరిశుభ్రమైన త్రాగు నీరు మరియు మరుగుదొడ్లు అందుబాటులో లేవు. పారిశుద్ధ్యం వాగ్ధానాన్ని మనం తీసుకోవడం ద్వారా మిషన్ పానీ చొరవ ద్వారా, రెకిట్ మరియు నెట్ వర్క్ 18 గ్రూప్ లు ప్రవర్తనాపరమైన మార్పుని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ చొరవకి మద్దతు ఇవ్వడానికి మరియు పెద్ద సంఖ్యలో జనాభాకి ముఖ్యంగా గ్రామీణ భారతదేశానికి ఈ సందేశాన్ని తీసుకువెళ్లడం మన అందరికీ తప్పనిసరి.”
ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం కార్యక్రమానికి దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అత్యంత కీలకమైన మానవ హక్కులలో ఒకటిగా సుస్థిరమైన పారిశుద్ధ్యం మరియు సురక్షితమైన నీటిని పొందడాన్ని ప్రచారం చేసే దిశగా సంభాషణలు జరిగాయి. వనరులు అందని జనాభా, కులాలు, తరగతులు, సామర్థ్యాలు యొక్క ఆందోళనల్ని దృష్టిలో పెట్టుకొని, సమీకృత వ్యవస్థల్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాల్ని ఉమ్మడిగా చేపట్టడానికి కూడా వేదిక భారతీయ పౌరులకు పిలుపునిచ్చింది. రిషీకేశ్, పాటియాలాలో హార్పిక్ వరల్డ్ టాయ్ లెట్ కాలేజీలు నుండి లైవ్ రిపోర్ట్స్, ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు మరియు సాధించినవారి ప్రయాణాలు కూడా కార్యక్రమంలో చూపించబడ్డాయి.
2022 నాటికి నెట్ వర్క్ 18 మరియు ఆన్-గ్రౌండ్ భాగస్వాములు ద్వారా భారతదేశంవ్యాప్తంగా మరుగుదొడ్డి వాడకం మరియు నిర్వహణ పై ప్రవర్తనని మార్చే ఉద్యమానికి హార్పిక్ మిషన్ పానీ 20 మిలియన్ లకి పైగా భారతీయుల్ని చేరే లక్ష్యాన్ని కలిగి ఉంది. అందరి కోసం సురక్షితమైన మరియు పరిశుభ్రమైన మరుగుదొడ్లకు మరియు 'ఎవరినీ వదలరాదు' వీలు కల్పించడంలో సహాయపడటానికి కార్యక్రమం వాష్ (నీరు, పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత-వాష్) పై దృష్టి సారిస్తుంది మరియు కార్యక్రమం విజయం స్వచ్ఛ్ సర్వేక్షన్ ర్యాంకింగ్స్ ద్వారా కొలవబడుతుంది. 2021లో ఆరు వరల్డ్ టాయ్ లెట్ కాలేజెస్ నుండి, హార్పిక్ భారతదేశంవ్యాప్తంగా 15 కాలేజెస్ ని వ్యాపింపచేసే ప్రణాళికల్ని కలిగి ఉంది. ఈ వరల్డ్ టాయ్ లెట్ కాలేజెస్ 2 లక్షలు మందికి పైగా పారిశుద్ధ్య పనివారు మరియు వారి విస్తరించబడిన కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తాయి.
వాగ్థానం రాష్ట్రీయ స్వచ్ఛ్ కేంద్రంలో తీసుకోబడింది. భూగర్భ జలాలు మరియు ఉపరితలం నీరు యొక్క సమైక్యతని నిర్వహించడానికి, ఆరోగ్యవంతమైన జీవితాలు కోసం సురక్షితమైన, పరిశుభ్రమైన, హరితదనం జీవితం కోసం సురక్షితమైన మరుగుదొడ్లు నిర్వహించడానికి, అందరి కోసం మరుగుదొడ్లు, పరిశుభ్రమైన త్రాగు నీరు , పరిశుభ్రత, సురక్షితమైన పారిశుద్ధ్యం చక్రం (నిర్మాణం, వాడకం, నిర్వహణ , శుద్ధి మరియు రీయూజ్) నీరు పొందడానికి దృష్టి కేంద్రీకరించే ఉద్యమానికి మహాత్మా గాంథీకి నివాళిగా కేంద్రం ఏర్పాటు చేయబడింది.