Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : 'షాంగ్-చి అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్‌లో అక్వాఫినా, మెంగ్’ర్ జాంగ్, ఫాలా చెన్, ఫ్లోరియన్ ముంటెను, బెనెడిక్ట్ వాంగ్ మరియు మిచెల్ యోహ్ కూడా ఉన్నారు' సూపర్‌హీరోలు అజేయంగా ఉండవచ్చు కానీ ఆ పాత్రల్ని పోషించే నటీనటులు తమ భావోద్వేగాలు ఉన్న కోణాన్ని చూపించేందుకు ఎప్పుడూ భయపడరు. షాంగ్-చి అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్ నటుడు సిము లియు మొదటిసారిగా దర్శకుడు డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ నుంచి సినిమా స్క్రిప్ట్‌ను విన్నప్పుడు ఇదే జరిగింది. తన కుటుంబంతో కుంగ్ ఫూ మాస్టర్ షాంగ్-చికు ఉన్న దృఢమైన అనుంబంధం గురించి విన్న నటుడు కన్నీటి పర్యంతమయ్యాడు. మార్వెల్ స్టూడియోస్ ఆసియన్ సూపర్ హీరో-ఆధారిత చలన చిత్రాలలో ఒకటిగా గౌరవించబడిన షాంగ్-చి ఒక ప్రియమైన పాత్ర కాగా, అతను రహస్యమైన టెన్ రింగ్స్ సంస్థ వలలోకి లాగబడినప్పుడు తన గతంలోని చెడులతో పోరాటం చేస్తాడు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు మరియు కన్నడ భాషలలో అందుబాటులో ఉన్న షాంగ్-చి అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్ ఇప్పుడు డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రత్యేకంగా ప్రసారం చేయబడుతోంది.
షాంగ్-చి మరియు ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్’ స్క్రిప్ట్‌ని చదువుతున్నప్పుడు భావోద్వేగానికి లోనైన తన అనుభవాన్ని పంచుకుంటూ నటుడు సిము లియు మాట్లాడుతూ, ‘‘నేను కథను చదివే ముందు, చివరి వరకు చదివినప్పుడు నాకు డెస్టిన్ కథను వివరించడం చాలా అందమైన పని. కథ వినగానే నేను ఏడ్చాను. షాంగ్-చి, పాత్రలు మరియు అతని కుటుంబానికి మధ్య అంత సన్నిహిత సంబంధం ఉండడం నాకు బాధ కలిగి ఏడ్చాను. సినిమా చివరిలో ఇది కుటుంబ కథా చిత్రమని నేను గ్రహించాను. ఒక ఆసియన్ సూపర్ హీరో, సూపర్ హీరో పనులు చేయడం మరియు ప్రపంచాన్ని రక్షించే క్రమాన్ని చూసి నాకు ఏడుపు వచ్చింది. ఒక అభిమానిగా, నటుడిగా, ఆసియాకు చెందిన వ్యక్తిగా నాకు ఇది చాలా అవిస్మరణీయమైన క్షణం. ఇది అసాధారణమైనది’’ అని పేర్కొన్నారు. ' షాంగ్-చి అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్‌లో కుంగ్ ఫూ మాస్టర్ షాంగ్-చి సాహసాలను ప్రత్యేకంగా వీక్షించేందుకు డిస్నీ+ హాట్‌స్టార్‌ను ట్యూన్ చేయండి'