Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మెరుగైన మల్టీ టాస్కింగ్ కోసం రామ్ ప్లస్ ఫీచర్, 8జిబి స్టోరేజ్‌తో గెలాక్సి A32 వేరియంట్‌ను విడుదల చేస్తున్నట్లు భారతదేశంలో అత్యంత విశ్వసనీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శామ్సంగ్ నేడు ప్రకటించింది. మెరుగైన పనితీరు కోసం రామ్ ప్లస్‌తో,మీరు మీ స్మార్ట్‌ఫోన్ అంతర్గత స్టోరేజ్‌ను వర్చువల్ మెమరీగా ఉపయోగించుకోవచ్చు. ఇంటెలిజెంట్ మెమరీ విస్తరణ 4జిబి అదనపు వర్చువల్ రామ్‌ను అందిస్తుండగా, గెలాక్సి A32ను 8జిబి మెమరీని 12జిబికి విస్తరిస్తుంది. ఇది ప్రయాణంలో మరిన్ని యాప్‌లను వినియోగించుకునేందుకు అలాగే, యాప్‌ల ప్రారంభ సమయాన్ని తగ్గించేందుకు వినియోగదారుడిని అనుమతిస్తూ, మల్టీ టాస్కింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. గెలాక్సి A32 వెనుక 64మెగా పిక్సిల్ క్వాడ్ కెమెరా కలిగి ఉండడంతో, ఇది అధిక స్పష్టతతో ఆకర్షించే సెల్ఫీలు తీసుకునేందుకు 20ఎంపి ఫ్రంట్ కెమెరాతో పాటు కంటిని ఆకర్షించే మరియు స్పష్టమైన ఫోటోలు తీసుకునేందుకు మీకు అవకాశం కల్పిస్తుంది. గెలాక్సి A32 మృదువైన స్క్రోలింగ్, బ్రౌజింగ్ మరియు గేమింగ్ కోసం 90హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.4’’ ఎఫ్‌హెచ్‌డి+ ఎస్అమోల్డ్ ఇన్ఫినిటీ-యు స్క్రీన్‌ను కలిగి ఉంది. ప్రకాశవంతమైన సూర్యకాంతిలో కూడా స్పష్టత కోసం డిస్ప్లే గరిష్టంగా 800 నిట్ల వరకు బ్రైట్నెస్కు మద్దతు ఇస్తుంది. గెలాక్సి A32 తన అధునాతన ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో జి80 G80 ప్రాసెసర్‌తో ఉన్నత పనితీరును అందిస్తుంది. ఇది 5000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉండగా, 15W అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో అందుబాటులోకి వస్తోంది.
ధర మరియు లభ్యత
గెలాక్సి A32 8జిబి+128జిబి రూ.23,499 ధరలో రిటైల్ స్టోర్లు, Samsung.com మరియు ప్రముఖ ఆన్లైన్ పోర్టల్లలో అందుబాటులో ఉంది. గెలాక్సి A32 8జిబి చూపులను ఆకట్టుకునే మూడు ఆకర్షణీయమైన వర్ణాలు – ఆసమ్ బ్లాక్, ఆసమ్ నీలం మరియు ఆసమ్ వైలెట్లలో లభిస్తుంది.