Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వినియోగదారులపై భారం
న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, కూరగాయలు సహా నిత్యావసరాలు ఇప్పటికే కొండెక్కి సామాన్యుడికి చుక్కలు చూపుతుంటే తాజాగా టెలికం కంపెనీల చార్జీల బాదుడు ప్రారంభమైంది. ప్రయివేటు రంగంలోని భారతీ ఎయిర్టెల్ తన టారీఫ్ చార్జీలను భారీగా పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 26 నుంచి ప్రీపెయిడ్ ప్లాన్లపై టారీఫ్లను 20-25 శాతం పెంచనున్నట్లు వెల్లడించింది. దీంతో వినియోగదారుల నుంచి సగటు రాబడి (ఏఆర్పీయూ)ని భారీగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. చార్జీల పెంపునతో వినియోగదారుడి నుంచి కనీసం రూ.200 ఏఆర్పీయూను రాబట్టుకోవాలని అంచనా వేస్తోంది. ఏఆర్పీయూను రూ.300కు చేర్చాలని ఆ కంపెనీ ఎప్పుటి నుంచో యోచిస్తోంది. ఇప్పటి వరకు రూ.79కే 28 రోజుల గడువుతో అందిస్తున్న బేసిక్ ప్లాన్ ధరను రూ.99కి పెంచింది. రూ.149 ప్లాన్ను రూ.179కి, 219 ప్లాన్ను 265కు, రూ.399 ప్లాన్ను రూ.479కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అన్ని ప్లాన్ల ధరలను అమాంతం పెంచేసింది. ఇదే బాటలో వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో నిర్ణయం తీసుకోనున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎయిర్టెల్ చార్జీల పెంపు ప్రకటనతో సోమవారం బిఎస్ఇలో ఆ కంపెనీ షేర్ 3.90 శాతం పెరిగి రూ.742.05కు చేరింది.