Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరంగల్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం భారతదేశంలో సాధారణ వంధ్యత్వం రేటు 3.9 శాతం నుంచి 16.8 శాతం మధ్య ఉంది. తక్కువ సంతానోత్పత్తి అనేది ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణంగా మారుతోంది, ప్రత్యేకించి అనేక పట్టణాల్లో మహిళలు తమ మొదటి శిశువులను మధ్య వయస్సులో ప్లాన్ చేసుకుంటున్నారు. భారతదేశంలో దాదాపు 28 మిలియన్ల జంటలు వంధ్యత్వంతో బాధపడుతున్నారు, అయితే వారిలో 1శాతం మంది కూడా సంతానోత్పత్తి నిపుణులను సందర్శించడం లేదు. వారికి అందుబాటులో ఉన్న అత్యాధునిక విజయవంతమైన చికిత్స ఎంపికల గురించి అవగాహన కల్పించడం ఎంతో అవసరం ఉంది.
వంధ్యత్వ నిపుణులు, ఎంబ్రియాలజిస్ట్లు, ఆండ్రాలజిస్ట్లు, ఇతర ఆరోగ్య సంరక్షణ నిపుణులు కృత్రిమ పునరుత్పత్తి సాంకేతికతలలో నూతన పద్ధతులు, మెరుగైన ఫలితాల కోసం వాటి వినియోగం గురించి తెలియజేసేందుకు ఒయాసిస్ ఫెర్టిలిటీ ఆధ్వర్యంలో ఏఆర్టీ సదస్సును నిర్వహిస్తోంది.
ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ సహ వ్యవస్థాపకులు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా జి రావు మాట్లాడుతూ 'ఫెర్టిలిటీపై తాజా పరిశోధనలు, వంధ్యత్వ చికిత్సలో పురోగతిపై చర్చించి భారతదేశం అంతటా సంతానోత్పత్తి నిపుణులకు శిక్షణ ఇవ్వడం సదస్సు ముక్యోద్దేశ్యం. పీజీటీ (ప్రీ-ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్) వంటి కొన్ని నూతన పద్దతులు తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఏదైనా జన్యుపరమైన రుగ్మతను బదిలీ చేసే అవకాశాన్ని దూరం చేయడంలో సహాయపడతాయి. ఈఆర్ఏ (ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అర్రే) అనేది గర్భాశయంలో పిండాన్ని అమర్చడానికి సరైన సమయాన్ని కనుగొనడంలో సహాయపడే మరొక సాంకేతికతు` అని తెలిపారు.
డాక్టర్ దుర్గ జి రావు మాట్లాడుతూ..' కృత్రిమ మేధస్సు (ఏఐ) వంధ్యత్వ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతోంది. మెషిన్ లెర్నింగ్ ద్వారా ఇంప్లాంటేషన్ చేయడం ద్వారా సరైన పిండాలను తీసుకోవచ్చు, తద్వారా మానవ జోక్యాన్ని తగ్గించి ఐవీఎఫ్ చికిత్సలో విజయాల రేటును పెంచుతుంది. ఈ ఏఆర్టీ సదస్సు ద్వారా సంతానోత్పత్తి చికిత్సలో ఇటీవలి నూతన పద్దతులపై అవగాహన కల్పించడమే కాకుండా ఇందులో పాల్గొన్న వారికి వ్యక్తిగత సంతానోత్పత్తి చికిత్సలకు పరిష్కారాలను అందించడంలో సహాయపడటానికి ప్రయత్నిస్తున్నాము` అని అన్నారు.
ఒయాసిస్ ఫెర్టిలిటీ సైంటిఫిక్ హెడ్ అండ్ క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ 'మేము సమగ్ర నూతన విధానాన్ని అనుసరిస్తున్నాము. ఈ సాంకేతికత సహాయంతో సాక్ష్యం-ఆధారిత, నైతికతతో కూడిన చికిత్సలను అందిస్తాము. ఐవీఎఫ్ చికిత్సలో పిండం నాణ్యత చాలా కీలకం కాబట్టి మా ఐవీఎఫ్ ల్యాబ్లు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించడమైనది. పురుషుల వంధ్యత్వ సమస్యలను తొలగించడానికి ఆండ్రోలైఫ్ పేరిట ప్రత్యేకమైన పురుష సంతానోత్పత్తి క్లినిక్లు కూడా నిర్వహిస్తున్నాము. మేము మైక్రో - టీఈఎస్ఈ (మైక్రోస్కోపిక్ టెస్టిక్యులర్ స్పెర్మ్ ఎక్స్ట్రాక్షన్)లో ప్రత్యేకత కలిగి ఉన్నాము, ఇది పురుషులు వంధ్యత్వ సమస్యలను అధిగమించడానికి, పితృత్వాన్ని పొందడంలో సహాయపడే అధునాతన సాంకేతికత. సాంకేతికత, హైటెక్ పరికరాలు, అనుభవజ్ఞులైన సంతానోత్పత్తి నిపుణుల ద్వారా బాధ్యతతో అందుబాటులో ఉన్న అన్ని సరసమైన చికిత్సలను అందిస్తున్నాం` అని అన్నారు.
ఈ సందర్భంగా వరంగల్ ఒయాసిస్ ఫెర్టిలిటీ క్లినికల్ హెడ్ డ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జలగం కావ్య రావు మాట్లాడుతూ 'ఏఆర్టీ సదస్సు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత ఎక్కువ మంది ఔత్సాహికులకు తెలియజేయడం ద్వారా వారి జీవితాల్లో సానుకూల ఫలితాలను తీసుకురాగలదని అన్నారు. కొన్ని వేల మంది జంటలు గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీవనశైలి మార్పులు, ఆలస్యమైన పేరెంట్హుడ్ మరియు ఇతర పర్యావరణ కారకాల కారణంగా వంధ్యత్వం భారతదేశంలో ప్రధాన ఆరోగ్య సమస్యలలో ఒకటిగా మారుతోంది. అనేక అధునాతన సంతానోత్పత్తి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి కానీ వాటి గురించి అవగాహన లేదు.