Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తన కొత్త కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను విడుదల చేసేందుకు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తాజాగా హెచ్‌డీఎఫ్‌సీతో భాగస్వామ్యం కుదర్చుకున్నట్టు ప్రకటించింది. దీంతో ఈక్విటాస్ తన వినియోగదారులకు బ్యాంకింగ్ పర్యావరణ వ్యవస్థకు సంబంధించిన మెరుగైన సౌకర్యాలను అందించాలన్న లక్ష్యంతో క్రెడిట్ కార్డ్‌లు అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపింది. క్రెడిట్ కార్డును మొదటి కేటగిరీలో రూ.25,000 నుంచి రూ.2 లక్షల వరకు, రెండవ కేటగిరీలో రూ.2 లక్షల కన్నా ఎక్కువ క్రెడిట్‌ను అందించే 'ఎలిగెన్స్ క్రెడిట్ కార్డ్' ఉన్నాయని తెలిపింది.