Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు అందిస్తున్న జీవితకాల ప్లాన్లను రద్దు చేసింది. తన ఖాతాదారులందరినీ రూ. 107 ప్రీమియం పర్ మినిట్ ప్లాన్‌లోకి మార్చింది. ఇందులో 90 రోజులు. అపరిమిత ఇన్కమింగ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్‌తో లభించే 10 జీబీ డేటా కాలపరిమితిని 30 రోజులుగా నిర్ణయించింది. 100 నిమిషాల అవుట్ గోయింగ్ కాల్స్ కాలపరిమితి 24 రోజులుగా ఉంది. కాలర్ ట్యూన్స్‌ను మాత్రం 60 రోజులపాటు వినియోగించుకోవచ్చు. తాజా మార్పులు డిసెంబరు 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆ సంస్థ తెలిపింది.