Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో సుప్రసిద్ధ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీలలో ఒకటైన హంగామా, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. నెలవారీ రేడియో ప్రసంగం, మన్ కీ బాత్ కోసం ప్రత్యక్ష ప్రసార భాగస్వామిగా మారింది. ప్రజాస్వామ్య దేశంలో తమ సమస్యలను చర్చించే అవకాశం మాత్రమే కాదు వాటికి తగిన పరిష్కారాలను సైతం పొందాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ , రాజకీయాలకు ఆవల, భాగస్వామ్యం, శక్తికి ప్రతీకగా ఉంటుంది. హంగామా తమ ఛానెల్స్ హంగామా ప్లే, హంగామా మ్యూజిక్ ద్వారా 28 నవంబర్ 2021 ఉదయం 11 గంటల నుంచి ఈ షోను నూతన శ్రోతల దగ్గరకు తీసుకువెళ్లనుంది.
జన్‌శక్తి పై దృష్టి కేంద్రీకరించిన, మన్ కీ బాత్ ప్రోగ్రామ్‌ను భారతీయుల కోసం తీర్చిదిద్దారు. ఈ షో ద్వారా పలు ప్రజా ఉద్యమాలైనటువంటి స్వచ్ఛత, ఫిట్‌నెస్‌కు ప్రాచుర్యం కల్పించడం, మత్తుపదార్థాల మహమ్మారిపై పోరాటం, బాలికా రక్షణ, దివ్యాంగుల సంక్షేమం వంటి వాటిని ప్రోత్సహించింది. హంగామా ప్లే మరియు హంగామా మ్యూజిక్ ద్వారా మన్ కీ బాత్ ప్రసారం చేయడంతో మరింత విస్తృతంగా ఈ కార్యక్రమం ప్రజలకు చేరువవుతుంది.
ఈ భాగస్వామ్యం గురించి హంగామా డిజిటల్ మీడియా ఫౌండర్ అండ్ సీఈవో నీరజ్ రాయ్ మాట్లాడుతూ 'గౌరవ ప్రధాన మనసులో మాటను తెలుపుతున్న మన్ కీ బాత్ కార్యక్రమంతో భాగస్వామ్యం చేసుకోవడాన్ని గర్వంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ప్రజలలో చక్కటి ఆదరణ ఉంది. మన ప్రధాని మన దేశపు సానుకూలతలు, విజయాలు, భవిష్యత్ లక్ష్యాలు వంటి వాటిని మాత్రమే కాదు, మనకు ఆందోళన కలిగించే అంశాలు, వాటి పరిష్కారాలు గురించి కూడా ప్రస్తావిస్తుంటారు. తాము అభిమానించే దేశం ఏ విధంగా పురోగతి సాధిస్తుందో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. మా వేదికల ద్వారా మన్‌కీ బాత్ ను నూతన ప్రేక్షకుల దగ్గరకు తీసుకుపోనున్నాం. ఇప్పుడు కేవలం ఓ బటన్ నొక్కడంతో ప్రజలు ఎక్కడి నుంచైనా ఈ కార్యక్రమం వినగలరు` అని అన్నారు.