Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తమ మిషన్ మిలియన్ ట్రీస్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని మేడ్చల్ అడవి ప్రాంతంలో 5వేలకు పైగా మొక్కలను హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ నాటింది. శాస్త్రీయ పద్ధతిలో మొక్కలను నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యత కాపాడడంతో పాటుగా దానిని పునరుద్ధరించే ప్రయత్నంలో హెచ్డీబీ మిషన్ మిలియన్ ట్రీ కార్యక్రమాన్ని ఆరంభించారు. ఈ కార్యక్రమం కింద, ఈ కంపెనీ డిసెంబర్ 2019 నాటి నుంచి 150,000మొక్కలను నాటడంతో పాటుగా వాటి పోషణ కార్యక్రమాలను కూడా చూసింది.
మేడ్చల్లోని బసురగడి గ్రామంలో నాటిన ఈ మొక్కలలో ఔషద మొక్కలతో పాటుగా పండ్ల మొక్కలు సైతం ఉన్నాయి. ఇవి రైతు సమాజానికి సైతం జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచ నున్నాయి. దీనితో పాటుగా, ఈ నాటిన మొక్కలు కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటుగా పెరుగుతున్న గాలి కాలుష్యం సైతం తగ్గించి పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని హెచ్డీబీఎఫ్ఎస్ ఉద్యోగులు, అసోసియేట్లు నిర్వహించారు. నాటిన ప్రతి మొక్క సంరక్షణను స్ధానిక కమ్యూనిటీలతో పాటుగా ప్లాంటేషన్ భాగస్వామి సంకల్ప్ తరు ఫౌండేషన్ చూసుకుంటాయి. ఆర్ధిక పరమైన మార్గదర్శకాలను హెచ్డీబీఎఫ్ఎస్ చూస్తుంది.
ఈ కార్యక్రమం గురించి శ్రీ వెంకట సతీష్, రీజనల్ మేనేజర్, సౌత్, హెచ్డీబీఎఫ్ఎస్ మాట్లాడుతూ 'మిషన్ మిలియన్ ట్రీ కార్యక్రమం ద్వారా సమాజానికి మద్దతునందించేలా తమ సీఎస్ఆర్ నిబద్ధతలను కొనసాగించడాన్ని హెచ్డీబీ గర్వంగా భావిస్తుంది. ఈ కార్యక్రమాన్ని పర్యావరణ సమతుల్యత కాపాడటం లక్ష్యంగా చేసుకుని ప్రారంభించడంతో పాటుగా వ్యవసాయ సమాజానికి జీవనోపాధినీ అందిస్తుంది` అని అన్నారు.