Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మొట్టమొదటిసారిగా బాడీ బటర్‌ను 1992లో ద బాడీ షాప్ విడుదల చేసింది. నేడు ఈ ప్రతిష్టాత్మక మాయిశ్చరైజర్లును విపరీతంగా అభిమానిస్తున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూడు సెకన్లకూ ఒకటి విక్రయించబడుతుంది. నూతన బాడీ బటర్స్ను ఇప్పుడు వెగాన్ సొసైటీ (వెగాన్ సర్టిఫికేషన్ కోసం గోల్డ్ స్టాండర్డ్) నమోదుచేసింది. ఈ బాడీ బటర్స్ కనీసం 95శాతం సహజసిద్ధమైన పదార్థాలను కలిగి ఉంటాయి. 96 గంటల పాటు మాయిశ్చర్‌ను చర్మానికీ అందిస్తాయి.
వెగాన్ అనుకూలం, శరీరానికి ప్రీతిపాత్రం
నూతన, అభివృద్ధి చేసిన బాడీ బటర్స్ను వెగాన్ సొసైటీ నమోదు చేసింది మరియు ఇవి కనీసం 95శాతం సహజసిద్ధమైన పదార్ధాలతోనే తయారయ్యాయి. వీటిలో ఉపయోగించే కమ్యూనిటీ ఫెయిర్ ట్రేడ్ షియా బటర్‌ను ఘనా నుంచి తీసుకువచ్చారు. ఉత్తర ఘనాలోని టంగ్టియా ఉమెన్స్ అసోసియేషన్ నుంచి ఈ బటర్ సేకరించడం ద్వారా వారికి ఆర్ధిక స్వేచ్ఛనూ అందించారు. నేడు ఉత్తర ఘనాలోని 11 గ్రామాలకు చెందిన 600 మంది మహిళలు 18 దశల సంప్రదాయ పద్ధతులలో ఈ షియా బటర్ తయారుచేస్తున్నారు.
దాదాపు 96 గంటల పాటు లోతైన మాయిశ్చరైజర్‌ను అందిస్తాయి. వాస్తవానికి ద బాడీషాప్ అధ్యయనం ప్రకారం, 90శాతం మంది వినియోగదారులు ఈ ఫార్ములా చర్మంలో అతి సులభంగా కలిసిపోతుంది, అంటుకోదు అని వెల్లడించగా, 86శాతం మంది తమ చర్మం పరంగా ఆహ్లాదకరమైన అనుభవాలను పొందుతున్నామని వెల్లడించారు
స్ట్రాబెర్రీ, బ్రిటీష్ రోజ్, సత్సుమా, ఆల్మండ్ మిల్క్, మోరింగా, అవోకాడో, షియా, అర్గాన్, అలీవ్ రకాలలో ఈ బాడీ బటర్స్ లభ్యమవుతాయి. వీటి ధరలు 1395 రూపాయలతో ప్రారంభమవుతాయి.