Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో నోటి ఆరోగ్య సంరక్షణ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న కోల్గేట్-పామోలివ్ నోటి సంరక్షణ వ్యాపారంలో సుస్థిరమైన ఆవిష్కరణను తీసుకు రావడంలోనూ ముందంజలో ఉంది నిరంతరం పలు ఏళ్ల నుంచి వృత్తాకారంలో ఆర్థిక వ్యవస్థకు తన వంతు చేదోడును ఇస్తోంది. భారతదేశంలో మొదటిసారిగా రీసైకిల్ చేసుకోదగిన టూత్ పేస్ట్ ట్యూబులను ఇటీవల విడుదల చేసిన అనంతరం కోల్గేట్ ఇండియా తన మొదటి 100శాతం రీసైకిల్ చేయదగిన ప్లాస్టిక్ హ్యాండిల్ టూత్‌బ్రష్ - కోల్గేట్ రీసైక్లీన్ విడుదల చేయడం ద్వారా సుస్థిరతలో తన ముందడుగును వేసింది.
కోల్గేట్ రీసైక్లీన్ టూత్ బ్రష్‌ను ఆరోగ్యకరమైన నవ్వును దృష్టిలో ఉంచుకుని, భూగోళాన్ని సంరక్షించే దృష్టితో తయారు చేశారు. ఈ టూత్బ్రష్లోని కుచ్చులు పూర్తిగా ప్రకృతి సిద్ధంగా రూపొందించినవి, బిపిఏ రహితంగా ఉంటూ, హ్యాండిల్‌ను 100 శాతం మేర రీసైకిల్ చేయదగిన ప్లాస్టిక్‌తో తయారు చేశారు. దీని స్మార్ట్ డిజైన్ ఫీచర్లలో సిలిండర్ ఆకారపు హ్యాండిల్ జారకుండా గ్రిప్‌ను అందిస్తుంది మరియు పొడవుగా ఉండే కుచ్చులు లోతైన స్వచ్ఛతను అందిస్తాయి. ఈ పర్యావరణ స్నేహి టూత్ బ్రష్ అమెజాన్‌లో లభిస్తుంది మరియు దీని ప్యాకేజ్‌ను కూడా రీసైకిల్ చేయదగిన ఉత్పత్తితో తయారు చేశారు.
ఈ ఆవిష్కరణ గురించి కోల్గేట్-పామోలివ్ ఇండియా మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ చింతామణి మాట్లాడుతూ, 'ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని తిరిగి రూపొందించే నా నిబద్ధతకు అనుగుణంగా ఆవిష్కరణలను కొనసాగిస్తున్నాము. కోల్గేట్ రీసైక్లీన్ టూత్‌బ్రష్ పలు సంవత్సరాల క్రితం అసాధ్యం అనుకున్న దాన్ని ఇప్పుడు ఆవిష్కరించింది. దీని హ్యాండిల్‌ను 100శాతం రీసైకిల్ చేయదగిన ప్లాస్టిక్‌తో తయారు చేశారు మరియు కుచ్చులను పూర్తిగా ప్రకృతి సిద్ధంగా లభించే ఉత్పత్తితో తయారు చేశారు! ఈ అన్నీ మీకు అద్భుతమైన నోటి స్వచ్ఛత మరియు బ్రషింగ్ అనుభవాన్ని ఇస్తాయి. మా సుస్థిరత ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోకు దీన్ని చేర్చడానికి సంతోషిస్తున్నాము మరియు ఇలానే కొనసాగే భరోసాను ఇస్తాము` అని పేర్కొన్నారు.
కోల్గేట్-పామోలివ్ ఇండియా ఒక దశాబ్దానికి పైగా తన సుస్థితర ప్రయాణంలో పని చేస్తుంది మరియు కర్బన ఉద్గారాల అడుగు జాడలను తగ్గించే ప్రయత్నాలను నవీనకరించదగిన శక్తికి బదిలీ, నీటి సంరక్షణ వైపు చర్యలు మరియ వ్యర్థాలను తగ్గించడంలో ముందంజలో ఉంటూ నిర్వహిస్తోంది. ఈ ఏడాది రీసైకిల్ చేయదగిన ప్లాస్టిక్ హ్యాండిల్ ఉన్న టూత్ బ్రష్‌లను విడుదల చేయడం మరియు రీసైకిల్ చేయగదిన టూత్ పేస్ట్ ట్యూబ్‌ల విడుదలతో కోల్గేగ్-పామోలివ్ ప్లాస్టిక్‌ను వృత్తాకారపు ఆర్థిక వ్యవస్థలో భాగంగా చేసి సుస్థిరమైన ప్రత్యామ్నాయాన్ని సృష్టించే ఉద్దేశాన్ని కలిగి ఉంది.
కోల్గేట్-పామోలివ్ ఇండియా రీసైక్లింగ్ ప్యాకేజింగ్ మరియు సుస్థిరత లక్ష్యాల గురించి ఎక్కువ సమాచారానికి https://www.colgatepalmolive.co.in/core-values/sustainability ను విజిట్ చేయవచ్చు.