Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బైజూస్ గ్రూప్‌లో భాగం కావడంతో పాటుగా ఉన్నత, ప్రొఫెషనల్ విద్య కోసం సుప్రసిద్ధ అంతర్జాతీయ ఎడ్టెక్ కంపెనీలలో ఒకటిగా వెలుగొందుతున్న గ్రేట్ లెర్నింగ్ సంస్థ అత్యాధునిక సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ను సేల్స్ రంగంలో ప్రారంభించింది. పరిశ్రమ నిష్ణాతులు, గ్రేట్ లెర్నింగ్ మెంటార్ల చేత రూపకల్పన చేసిన ఈ ప్రోగ్రామ్ ఫ్రెషర్లు, జూనియర్ సేల్స్ వ్యక్తులు మరియు ఇతర ప్రారంభ దశ వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు తమ కెరీర్స్‌ను సేల్స్ రంగంలో వేగవంతం చేసుకునే అవకాశం అందిస్తుంది. ఈ కార్యక్రమం, అభ్యాసకులకు పూర్తిగా అంకితం చేసిన కెరీర్ సహాయాన్ని సైతం ఇంటర్వ్యూలు, రెజ్యూమ్ తయారుచేయడం, కెరీర్ గైడెన్స్, ఉద్యోగావకాశాలు, ఇంటర్వ్యూ గ్యారెంటీ పరంగా అందిస్తుంది.
ఈ 15వారాల ఆన్లైన్ ప్రోగ్రామ్ నిర్మాణాత్మక విధానంతో ఉండటంతో పాటుగా అభ్యాసకులకు బీ2సీ అమ్మకాలను పూర్తిగా అర్థం చేసుకునేందుకు తోడ్పడుతుంది. అదే రీతిలో వినియోగదారుల సంబంధాలు, ధరలు, అమ్మకపు వ్యూహాలు, బేరసారాలు, విశ్లేషణలు, అత్యంత కీలకమైన సాంకేతికతలను గురించి తెలుపడం ద్వారా విజయవంతంగా అమ్మకాలను నిర్వహించడం తెలుపుతారు. సేల్స్ బృందాలను ప్రభావవంతంగా నిర్వహించడంలోని పలు అంశాలను సైతం ఇది తెలుపడంతో పాటుగా పర్యవేక్షణ, స్ఫూర్తి కలిగించడం, సేల్స్ సిబ్బందితో కూడిన బృంద నిర్వహణలోని పలు అంశాలను సైతం వెల్లడిస్తుంది. వాస్తవ ప్రపంచపు పరీక్షలతో పాటుగా పరిశ్రమ నిపుణుల సదస్సులు, కేస్ స్టడీస్ మరియు వాస్తవ సమయపు ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందో తెలుపుతూ నమూనా ఇంటర్వ్యూలు సైతం నిర్వహించనున్నారు. అంతేకాదు,35 గంటలకు పైగా ప్రత్యక్ష అభ్యాసంతో 80కు పైగా అభ్యాస గంటల ద్వారా నిర్ధిష్టమైన శిక్షణను సైతం అందించనున్నారు. ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశ్యం యువ నిపుణులకు సేల్స్ రంగంలో అవసరమైన కీలక నైపుణ్యం పొందడంలో సహాయపడటం. తద్వారా, వారు తమను తాము ప్రత్యేకంగా మలుచుకుంటూనే అత్యధిక జీతాలు, అత్యుత్తమ నాణ్యత కలిగిన సేల్స్ బాధ్యతలలో ఉద్యోగాలను నెరిపే అవకాశం పొందగలరు.
ఈ కార్యక్రమం గురించి గ్రేట్ లెర్నింగ్ కో ఫౌండర్ హరికృష్ణన్ నాయర్ మాట్లాడుతూ'డిజిటల్ యుగం నూతన తరహా నైపుణ్యాలను సృష్టించింది. విజయపథంలో నిలువాలనుకునే సేల్స్ ప్రొఫెషనల్స్ ఈ అంశాల పట్ల పూర్తి నైపుణ్యం సంతరించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆర్ధికసేవలు,వాణిజ్యం, విద్య మొదలైన రంగాలలో సేల్స్ ఉద్యోగాల పరంగా ఎలాంటి కొరత లేనప్పటికీ, నూతన డిజిటల్ వ్యవస్థలో విజయవంతంగా దూసుకుపోయే సుశిక్షితులైన సేల్స్ నిపుణుల కొరత మాత్రం వృద్ధి చెందుతుంది. అవసరమైన నైపుణ్యాలు కలిగిన ప్రొఫెషనల్స్ ఉద్యోగ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించగలరు. గ్రేట్ లెర్నింగ్ వద్ద అభ్యసించిన ఫ్రెషర్స్ యొక్క సరాసరి ప్రారంభ జీతాలు పలు ప్రవేశ దశ ఉద్యోగాలలో 5-7 లక్షల రూపాయల నడుమ ఉంది* అని అన్నారు
'బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, మేనేజ్మెంట్ ట్రైనీలు, ఇన్సైడ్ సేల్స్ స్పెషలిస్ట్, సేల్స్ కన్సల్టెంట్ వంటి ఆదరణీయ విభాగాలలో అభ్యాసకులకు శిక్షణ అందిస్తుంది. గ్రేట్ లెర్నింగ్ 150కు పైగా హైరింగ్ నెట్‌వర్క్‌లో వోడాఫోన్, ఇండియా మార్ట్, లీడ్స్స్కేర్డ్, గ్లోబల్ లాజిక్, సుథర్‌ల్యాండ్, యాక్సిస్‌బ్యాంక్, డీఎక్స్‌సీ టెక్నాలజీ, ఈక్విటీస్ బ్యాంక్ మరియు మరెన్నో ఉన్నాయి. ఇవి ప్రస్తుతం 5వేలకు పైగా ఉద్యోగాలను అందించాయి. ప్రతి నెలా వందలాది ఉద్యోగాలను జోడిస్తున్నాయి. ఈ ప్రోగ్రామ్ విజయవంతంగా పూర్తయిన తరువాత అభ్యాసకులు గ్రేట్ లెర్నింగ్ నుంచి సర్టిఫికెట్ అందుకోగలరు` అని తెలిపారు.
గ్రేట్ లెర్నింగ్ గురించి
'బైజూస్ గ్రూప్‌లో భాగమైన గ్రేట్ లెర్నింగ్, ప్రొఫెషనల్ మరియు ఉన్నత విద్య కోసం అగ్రగామి అంతర్జాతీయ ఎడ్ టెక్ కంపెనీ. సమగ్రమైన, పరిశ్రమ సంబంధిత కార్యక్రమాలను పలు విప్లవాత్మక సాంకేతికత, డాటా, వ్యాపార విభాగాలలో అందిస్తుంది. గ్రేట్ లెర్నింగ్ కార్యక్రమాలను ప్రపంచంలో అత్యున్నత విద్యా సంస్థలు అయినటువంటి స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ, ఎంఐటీ, యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ఉఅస్టిన్బీ నేషనల్ యూనివర్శిటీ సింగపూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ బొంబే, ఐఐటీ రూర్కీ, ఐఐటీ ఢిల్లీ, శివ్ నాడార్ యూనివర్శిటీ మరియు గ్రూట్ లేక్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. అలాగే స్ధిరంగా పరిశ్రమ శక్తి వంతమైన అవసరాలకనుగుణంగా ఈ కార్యక్రమాలను మార్చడానికీ ప్రయత్నిస్తున్నారు. బ్లెండెడ్ మోడ్,క్లాస్రూమ్ మోడ్, పూర్తి ఆన్లైన్మోడ్లో ఈ కార్యక్రమాలను అందిస్తున్న ఒకే ఒక్క ఎడ్ టెక్ కంపెనీ గ్రేట్ లెర్నింగ్. ఇది తమ విస్తృత శ్రేణిలోని నిష్ణాతుల మెంటార్స్, అత్యున్నత అర్హతలు కలిగిన ఫ్యాకల్టీపై ఆధారపడి సాటిలేని అభ్యాస అనుభవాలను భారతదేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా అభ్యాసకులకు అందిస్తుంది. గ్రేట్ లెర్నింగ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు, ప్రొఫెషనల్స్ కోసం డిజిటల్ ఆర్థిక వ్యవస్ధలో విజయవంతమైన కెరీర్లను పొందేందుకు పరివర్తక అభ్యాసంను సాధ్యంచేయడానికి కృషి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 170 దేశాల నుంచి 2.7 మిలియన్ల మంది అభ్యాసకులపై మేము ప్రభావం చూపాము` అని తెలిపారు.