Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్త ప్రమోటర్ ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ తన మొదటి ఇండియాఫస్ట్ ఇ-టర్మ్ ప్లస్ ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, పర్సనల్ రిస్క్ ప్రీమియం, జీవిత బీమా పథకాలను జీవితంలో అనిశ్చితుల నుంచి ప్రియమైన వారిని ఆర్థికంగా సురక్షితంగా ఉంచేందుకు మరియు సంతృప్తికరమైన భవిష్యత్తు అందించేలా డిజైన్ చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ డిప్యూటీ సీఈఓ రుషబ్ గాంధి మాట్లాడుతూ, 'ఎక్కువ జాగృతిని కల్పించవలసిన అవసరం ఉండగా, జీవిత బీమాను కొనుగోలు చేసుకోవడంలో వినియోగదారుల ప్రాధాన్యతల్లో గమనార్హమైన మార్పులు వచ్చాయి. మా కస్టమర్ ఫస్ట్ సిద్ధాంతానికి అనుగుణంగా మేము ఇండియాఫస్ట్ లైఫ్ ఇ-టర్మ్ ప్లాన్‌ను పలు ఆవిష్కారాత్మక రక్షణ ఎంపికలతో విడుదల చేసేందుకు చాలా సంతోషిస్తున్నాము. పూర్తిగా రక్షణ అందించే ప్లాన్‌ను పాలసీబజార్.కాం సలహాతో అభివృద్ధి చేశాము. టర్మ్ ఇన్సూరెన్స్ రంగంలో అత్యంత అనుకూలకరమైన ఆఫర్లలో ఒకటిగా ఉంది. అలాగే పోటీతో కూడిన ధరలో లభిస్తుంది. ఈ ప్లాన్ డిజిటల్ మాధ్యమాల ద్వారా కొనుగోలు చేసుకునే వారికి ప్రీమియాలకు మొదటి ఏడాది రాయితీను అందిస్తుండగా, దీన్ని పాలసీ బజార్ వినియోగదారులకు అత్యంత ప్రశంసలతో కూడిన పాలసీగా ఉండనుంది` అని అన్నారు.
పాలసీబజార్.కాంలో లైఫ్ ఇన్సూరెన్స్ విభాగం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సంతోశ్ అగర్వాల్ మాట్లాడుతూ, ' వినియోగదారుల జీవిత బీమా అవసరాలను నెరవేర్చే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాము. ఈ అసాధారణ మహమ్మారి సమయంలో టర్మ్ ప్లాన్ల గురించి జాగృతి, డిమాండ్ వృద్ధి చెందింది. వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా మేము ఇండియాఫస్ట్ లైఫ్ ఇ-టర్మ్ ప్లస్ ప్లాన్‌ను మా పోర్టల్‌లో ప్రముఖ ఆఫర్‌గా అందించేందుకు చాలా సంతోషిస్తున్నాము. ఈ ఆవిష్కారాత్మక, ఖర్చును ఆదా చేసే ప్లాన్ పలు ఆఫర్లను కలిగి ఉండగా, అందులో ప్రత్యేక ఎగ్జిట్, ప్రీమియం బ్రేక్ కలిసి ఉండగా, పాలసీబజార్ కుటుంబ సభ్యులకు ఆర్థికంగా వారి కుటుంబపు భవిష్యత్తును ఒకే ప్లాన్‌లో సురక్షితంగా ఉంచేందుకు సహకరిస్తుంది` అని తెలిపారు.
ఇండియాఫస్ట్ లైఫ్ ఇ-టర్మ్ ప్లస్ ప్లాన్ సమ్రగత కలిగిన ఉత్పత్తి కాగా, ప్రమాదంతో శాశ్వత అంగవైకల్యం, తీవ్రమైన అనారోగ్యం, సహజ లేదా ప్రమాదంతో మరణం (ఎబిడి) సందర్భంలో బీమా చేయించుకున్న వారు, అతను/ఆమెకు ప్రియమైన వారికి అత్యంత అవసరమైన ఆర్థిక మద్ధతు ఇచ్చేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అదనంగా, బీమా తీసుకున్న వారు ఈ పాలసీతో మొత్తం లేదా క్రమబద్ధమైన ఆదాయం లేదా రెండింటి సమ్మేళనాన్ని వారి బీమా ఎంపికలకు అనుగుణంగా పొందవచ్చు. వ్యక్తులు చెల్లించిన ప్రీమియాలపై, పొందిన నగదుపై పన్ను అనుకూలతలను ప్రస్తుతం ఆదాయ పన్ను చట్టాలకు అనుగుణంగా పొందుతారు.
ఇండియాఫస్ట్ లైఫ్ వైవిధ్యమయ 45 అవసరాల ఆధారిత (ఉత్పత్తులు మరియు రైడర్లు) ఆఫర్లను వైవిధ్యమయ వినియోగదారుల వలయాలకు అందిస్తుండగా, అందులో పలు వితరణల సామర్థ్యాలను వినియోగించుకుంటోంది. అనేక పెట్టుబడి ఎంపికలను విస్తరిస్తోంది. కంపెనీ సేవలు వినియోగదారులకు దేశవ్యాప్తంగా 98శాతం పిన్కోడ్లలో లభిస్తాయి.