Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటాలియన్ బ్రాండ్ బీఎస్ 6 శ్రేణి మోటర్‌సైకిళ్ల ప్రదర్శన
ఎంక్వైరీలు, బుకింగ్స్, డెలివరీలు ప్రారంభం
అనంతపురం : ప్రీమియం బైక్స్ తయారీదారునిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బెనెల్లీ, ఆదీశ్వర్ ఆటో ఇండియా- మహవీర్ గ్రూప్‌తో కలిసి నేడు తమ 48 వ ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌ను అనంతపురంలో తెరిచింది. ఈ అత్యాధునిక షోరూమ్ అనంతపురంలో రుద్రంపేట వద్దనున్న సాక్షి కార్యాలయం పక్కన తెరిచారు. ఈ షోరూమ్‌ను చిదంబరేశ్వర ఆటో మొబైల్స్ డీలర్షిప్ కింద ఏర్పాటుచేయడంతో పాటుగా బీఎస్6 శ్రేణి బెనెల్లీ సూపర్‌బైక్స్‌ను ప్రదర్శించనున్నారు. వీటిలో
1. Imperiale 400 - Retro Classic - Rs. 1,89,900 (Silver colour) : Rs. 1,97,900 (Red & Black colour).
2. Leoncino 500 - Street Scrambler - Rs. 4,89,900 (Steel Silver colour); Rs. 4,99,900 (Leoncino red colour).
3. TRK 502 - Grand Tourer - Rs. 4,99,000 (Dark Grey colour); Rs. 5,10,000 (Pure White and Benelli Red colour).
4. TRK 502X - Adventure Tourer - Rs. 5,45,900 (Dark Grey colour); Rs. 5,55,500 (Pure White and Benelli Red colour).
5. Ultimate Urban Cruiser, Benelli 502c - Rs. 5,15,900 (Matte Cognac Red); Rs. 5,20,900 (Glossy Black); Rs. 5,25,900 (Matte Black) ఉన్నాయి.
బెనెల్లీ ఇండియా ఇప్పుడు పరిమిత కాల ఆఫర్‌గా నెలకు 4999 రూపాయల ఈఎంఐతో ఇంపీరియల్ 400 బైక్ సొంతం చేసుకునే అవకాశం అందిస్తుంది. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు.
బెనెల్లీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ జబక్ మాట్లాడుతూ 'చిదంబరేశ్వర ఆటో మొబైల్స్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. మా కస్టమర్ సర్వీస్ సిద్ధాంతానికి అనుగుణంగా మా అనంతపురం డీలర్ భాగస్వామి సిద్ధాంతాలున్నాయి. ఈ షోరూమ్‌లో సిబ్బంది సుశిక్షితులు. అత్యుత్తమ సేల్స్, సర్వీస్, కస్టమర్ అనుభవాలను అందించగలరు` అని అన్నారు.
బెనెల్లీ అనంతపురం డీలర్ ప్రిన్సిపల్ సాయినాథ్ రెడ్డి మాట్లాడుతూ 'అనంతపురంకు బెనెల్లీని తీసుకురావడం పట్ల సంతోషంగా ఉన్నాము. బెనెల్లీ ఇండియాతో భాగస్వామ్యాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాము. స్థానిక బైకింగ్ ఔత్సాహికుల కలలను సాకారం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము` అని అన్నారు.