Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వేల్స్లో అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గత ఏడాదితో పోల్చితే 200 శాతానికి పైచిలుకు వృద్ధి చెందింది. ఇది యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఇతర ప్రాంతాల కన్నా అధిక వృద్ధి. భారతదేశం నుంచి ప్రస్తుతం 18 మిలియన్ల మంది విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణిస్తున్నారు, చదువుతున్నారు. ప్రపంచ స్థాయి విద్యను అందుకుంటున్నారు. వీరిలో 55,000 కన్నా ఎక్కువ మంది ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్లో నివసిస్తున్నారు.
గ్రాడ్యుయేషన్ అనంతరం సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు సహకరించేందుకు, చురుకైన మరియు అత్యుత్తమ అంతర్జాతీయ విద్యార్థులను నిలుపుకునేందుకు యూకే ప్రభుత్వం 2019లో గ్రాడ్యుయేట్ ఇమ్మిగ్రేషన్ రూట్‌ను పాయింట్ల ఆధారిత ఇమ్మిగ్రేషన్ విధానాన్ని ఒక మార్గంగా ప్రవేశపెట్టింది. అండర్ గ్రాడ్యుయేట్ లేదా మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిన విద్యార్థులు యూకేలో రెండేండ్ల పాటు ఉండేందుకు మరియు పని చేసేందుకు లేదా పని వెతుక్కునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీన్ని ప్రారంభించినప్పటి నుంచి యూకే వ్యాప్తంగా చదివేందుకు దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య సహజంగానే వృద్ధి చెందింది.
చదువుకునేందుకు వస్తున్న భారతీయ విద్యార్థుల వృద్ధిని గురించి ఇండియా మార్కెట్ డెవలప్మెంట్ మేనేజర్ ఫర్ స్టడీ ఇన్ వేల్స్ హరీష్ లోఖున్ మాట్లాడుతూ, 'వేల్స్ ఒక దేశంగా, అందమైన బీచ్‌లు, పచ్చిక బయళ్లతో ల్యాండ్‌స్కేప్‌లు, సరసమైన జీవనాన్ని అందిస్తోంది. వేల్స్‌లోని విశ్వవిద్యాల యాలు యూకేలో అతి తక్కువ వసతి ఖర్చులను కలిగి ఉన్నాయి. వేల్స్లో చదువుకునేందుకు ఎంచుకున్న ఏ విద్యార్థి అయినా విద్యావేత్తలు, పరిశోధన మరియు ఆవిష్కరణలతో నిమగ్నమై ప్రయోజనాలను పొందవచ్చు` అని వివరించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. 'యూకేలో చదువుకోవాలని కోరుకుంటన్న విద్యార్థుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని 2019లో గ్రాడ్యుయేషన్ ఇమ్మిగ్రేషన్ రూట్ ప్రకటన అనంతరం భారతదేశం నుంచి వస్తున్న దరఖాస్తుల సంఖ్యలో వృద్ధి కనిపించింది. ప్రపంచంలో మహమ్మారి ఉన్నప్పటికీ యూకేలో చదువుకోవాలని విద్యార్థులకు కోరిక ఉందని రుజువు చేసింది. వేల్స్లో చదువుకునే విద్యార్థులు ఇక్కడ తాము ఉన్న సమయం అంతా సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారు. భారతదేశంలోని ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే నగరాల నుంచి ఇక్కడ లభించే విరామాన్ని స్వాగతిస్తారు. చాలా మంది విద్యార్థులు తమకు ఈ నగరం ఎటువంటి స్వాగతం పలుకుతుందో కూడా ఇప్పటికే తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు` అని హరీష్ లోఖున్ తెలిపారు.
భారతీయ విద్యార్థులకు మద్దతుగా, వెల్ష్ విశ్వవిద్యాలయాలు తెలంగాణలో ఉన్నత విద్యారంగంతో కొత్త భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. భాగస్వామ్యాలకు వేల్స్ విశ్వవిద్యాలయాలు మరియు వేల్స్ మరియు భారతదేశంలోని బ్రిటిష్ కౌన్సిల్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. గ్లోబల్ వేల్స్, వెల్ష్ అంతర్జాతీయ ఉన్నత విద్యా భాగస్వామ్యం, మరియు బ్రిటీష్ కౌన్సిల్, యూకేలోని విద్యా అవకాశాలు మరియు సాంస్కృతిక మార్పిడి కోసం పని చేస్తున్న అంతర్జాతీయ సంస్థ కాగా, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తో కలిసి దాని ఉన్నత విద్యా సంస్థలలో పాఠ్యాంశాలను సంస్కరించేందుకు పని చేస్తున్నాయి. మూడేండ్లలో కొత్త పాఠ్యప్రణాళిక సంస్కరణ పైలట్ ప్రాజెక్టుగా 1,000 కళాశాలలకు విస్తరించనున్నారు. ఇది 800,000 కన్నా ఎక్కువ మంది అభ్యాసకులను సానుకూలంగా ప్రభావితం చేయనుంది మరియు తెలంగాణ తన ఉన్నత విద్యా రంగాన్ని అంతర్జాతీయీకరణను అభివృద్ధి చేయడంలోనూ చేదోడుగా నిలువనుంది.
హైదరాబాద్‌కు చెందిన దత్తసాయి బీరం అనే భారతీయ విద్యార్థి వేల్స్ రాజధాని నగరమైన కార్డిఫ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ అవకాశాలను పరిశోధించిన తర్వాత, దత్తసాయి తన విద్యను కొనసాగించేందుకు యునైటెడ్ స్టేట్స్కు వెళ్లాలని మొదట భావించారు - కాని 24 ఏండ్ల యువకుడికి ఇక్కడ చదవడం చాలా చౌక అని తెలుకున్న తర్వాత వేల్స్‌కు మకాం మార్చుకున్నాడని చెబుతున్నారు. ఇంటర్నేషనల్ పబ్లిక్ రిలేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న దత్తసాయి బీరం మాట్లాడుతూ 'చదువుకునేందుకు వేల్స్ చక్కని ఎంపిక. కార్డిఫ్ చాలా చౌకైన నగరం, ఇది నేను నిర్ణయం తీసుకునేటప్పుడు నన్ను ప్రదానంగా ఆకర్షించింది. ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. ఇటువంటి వైవిధ్యభరితమైన వ్యక్తులను నేను గతంలో ఇంతకు ముందెన్నడూ కలవలేదు. ఇది నిజంగా ఇంక్రెడిబుల్!` అని పేర్కొన్నారు.
తెలంగాణకు చెందిన వికాష్ మాధవ్ కూడా ఈ ఏడాది ప్రారంభంలో కార్డిఫ్ విశ్వవిద్యాలయంలో సైబర్ సెక్యూరిటీలో ఎంఎస్సీ చదివేందుకు వేల్స్‌కు వెళ్లారు. తనకు 20 ఏండ్ల వయస్సు వచ్చే వరకు తెలంగాణలో చదువుకుని ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలన్న నిర్ణయం వికాష్‌కు మొదట్లో చాలా కష్టంగా అనిపించింది - కాని వెంటనే, అతను చాలా మంది విద్యార్థులను కలుసుకుని, త్వరగా స్థిరపడ్డారు. వికాష్ స్టడీ ఇన్ వేల్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్కు కూడా అర్హత సాధించి, ట్యూషన్ ఫీజు కోసం సుమారుగా 5,000 అంటే సుమారుగా రూ.4,18,000 అందుకున్నాడని చెబుతున్నారు. వికాష్ మాట్లాడుతూ 'నికార్డిఫ్లో నేను కలిసే ప్రతి ఒక్కరూ విద్యార్థులే ఉ విద్యార్థి సంఘం నాకు బాగా మద్దతు ఇస్తున్నట్లు భావిస్తున్నాను. లెక్చరర్లు అందరూ చాలా ప్రొఫెషనల్, మరియు కోర్సు నిర్మాణం అద్భుతమైనది. వేల్స్లో నేర్చుకునే పద్ధతులు అద్భుతంగా ఉన్నాయి - తరగతులు నేను భారతదేశంలో అనుభవించినంత మెకానికల్‌గా లేవుబీ వారు చాలా ఇంటరాక్టివ్‌గా ఉన్నారు` అని పేర్కొన్నారు.
వేల్స్లో అందుబాటులో ఉన్న అద్భుతమైన అవకాశాలను పరిశోధించమని అతను ప్రోత్సహిస్తున్నాడు.
వేల్స్లో అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో చదవడం గురించి మరింత తెలుసుకునేందుకు మరియు వేల్స్‌లోని ఎనిమిది విశ్వవిద్యాలయాలలో వందలాది ప్రపంచ-ప్రముఖ కోర్సులను చదివేందుకు, స్టడీ ఇన్ వేల్స్ వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు. https://www.studyinwales.ac.uk/