Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : భారతదేశంలో ప్రముఖ డీటీహెచ్ ఆపరేటర్, పే టీవీ ప్లాట్‌ఫామ్ టాటా స్కై. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది. అయితే టాటాస్కై ఇప్పుడు తెలుగు మార్కెట్‌పై మరింత ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తెలుగు మార్కెట్‌ని మరింత బలోపేతం చేసేందుకు సరికొత్త క్యాంపెయిన్ని నిర్వహిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన కంటెంట్‌ను అందిస్తూ సరసమైన ధరల్లో ప్యాక్‌లను అందించేందుకు ఇప్పుడు 'లెవలే వేరు` పేరుతో క్యాంపెయిన్‌కు సిద్ధమైంది. వన్-టచ్ రిమోట్ అనే క్యాప్షన్‌తో అందుబాటులో ఉన్న రీజినల్ ఫ్యామిలీ ప్యాక్‌లను ప్రధానంగా హైలైట్ చేస్తోంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ముందుగా స్థానికంగా ఉండే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది టాటా స్కై. ఆ తర్వాత టాటా స్కై కనెక్షన్ ప్రయోజనాలు ప్రతీ ఒక్కరికీ తెలిసేలా టార్గెట్ వినియోగదారులను గుర్తించి.. వారిని బీటీఎల్ కార్యక్రమాల నెట్వర్క్ ద్వారా విక్రయానికి సంబంధించిన వివిధ మార్గాల్లోకి ప్రవేశించింది. ప్రింట్, టీవీ, ఓఓహెచ్ అంతటా విస్తరించిన ప్రత్యేక కమ్యూనికేషన్ ప్లాన్ మెట్రో, నాన్-మెట్రో స్థానాల్లోని స్థానిక ప్రేక్షకులతో ప్రతిధ్వనించేలా రూపొందించారు.
ఈ సందర్భంగా టాటా స్కై చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ శ్రీ అనురాగ్ కుమార్ మాట్లాడుతూ... ' ప్రాంతీయ ప్రేక్షకులకు వారి టీవీ సెట్లతో మరియు అందులో వారు చూసే వాటితో చాలా బలమైన కనెక్షన్ ఉంది. మా కొత్త ప్రచారం టాటా స్కై కనెక్షన్ విభిన్న ప్రయోజనాలను అందంగా హైలైట్ చేస్తుంది. ప్రేక్షకులు అత్యంత ఇష్టపడే ప్రాంతీయ క్యాచ్ఫ్రేజ్ల ద్వారా ప్రేక్షకులతో కనెక్ట్ అవుతుంది. టాటా స్కై కనెక్షన్ దాని వైవిధ్యమైన ఆఫర్లు మరియు వ్యక్తిగతీకరించిన బొకేట్లతో ఉన్నతమైన వినోదాన్ని అందించండం కోసమే ఈ క్యాంపెయిన్‌కి 'లెవలే వేరు` అనే పేరు పెట్టాం` అని అన్నారు.
ఇక ప్రైస్ సెన్సిటివ్ సెగ్మెంట్‌ను ఒక్కసారి పరిశీలిస్తే.. క్యాంపెయిన్ ప్రత్యేకంగా తెలుగు ప్రాంతీయ పిల్లల స్పోర్ట్స్ ప్యాక్‌ని హైలైట్ చేస్తుంది, ఇది ఉత్తమ తెలుగు ఛానెల్‌లు, డ్రామా, ఫిల్మ్, కిడ్స్, న్యూస్, స్పోర్ట్స్ ఛానెల్‌లు మొత్తం కుటుంబ ప్రయోజనాల కోసం క్యూరేట్ చేశారు. ఇవన్నీ కలిపి నెలకు కేవలం రూ. 249 లోపు మాత్రమే.
టాటా స్కైకు 23 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. దీంతో.. ఈ ఇండస్ట్రీలో ప్రముఖ డీటీహెచ్ ప్లేయర్‌గా ఉంది టాటా స్కై. ఇప్పుడు ప్రేక్షకుల్ని మరింతగా పెంచుకునేందుకు అగ్రశ్రేణి ఆఫర్లు, విలక్షణమైన కస్టమర్ సేవతో దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు మరినని అద్భుతమైన సేవలను అందించాలని భావిస్తోంది టాటా స్కై.
మొదటి గ్లింప్స్ మరియు యాడ్ క్యాంపెయిన్ని ఈ లింక్ లో చూడొచ్చు. https://www.youtube.com/watch?v=3Cqa63Fp4GI