Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్త ప్రమోటర్ ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ తన మొదటి ఇండియాఫస్ట్ ఇ-టర్మ్ ప్లస్ ప్లాన్‌ను విడుదల చేసినట్టు తెలిపింది. ఈ నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ప్లాన్‌తో జీవితంలో అనిశ్చితుల నుంచి ఖాతాదారులకు ప్రియమైన వారిని ఆర్థికంగా సురక్షితంగా ఉంచేందుకు, సంతప్తికరమైన భవిష్యత్తు అందించేలా రూపకల్పన చేసినట్టు ఆ సంస్థ డిప్యూటీ సీఈఓ రుషబ్ గాంధి పేర్కొన్నారు. ఈ జీవిత బీమా ప్లాన్‌ను డిజిటల్ మాధ్యమాల ద్వారా కొనుగోలు చేసే వారికి మొదటి ఏడాది రాయితీను అందిస్తున్నామన్నారు.