Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టారీఫ్‌ల దండింపుపై విమర్శలు
- బీఎస్ఎన్ఎల్పై ప్రశంసలు
న్యూఢిల్లీ : ఉచిత కాల్స్, డేటా అంటూనే ప్రయివేటు టెలికం కంపెనీలు ఇబ్బడిమబ్బడిగా టారీఫ్‌లను పెంచడంపై వినియోగ దారులు భగ్గుమం టున్నారు. ఇటీవల వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ఛార్జీలను పెంచగా.. తాజాగా రియలన్స్ జియో టారీఫ్‌లను అమాంతం పెంచింది. ధరల పెంపును నిరసిస్తూ సోమవారం ట్విట్టర్లో నెటిజెన్లు ట్రెడింగ్ చేశారు. 'బారుకాట్ జియో వొడా ఎయిర్టెల్' అనే హ్యాష్‌ట్యాగ్ హల్చల్ చేశారు. దీనికి నెటిజెన్ల నుంచి పెద్ద మొత్తంలో మద్దతు వస్తోంది. ప్రయివేటు టెల్కోలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ను ఎంచుకోవాలంటూ చాలా మంది సూచించారు. కొంత మంది ఖాతాదారులు జియో, ఎయిర్టెల్, వొడా ఐడియా నెట్‌వర్క్‌ల నుంచి బీఎస్ఎన్ఎల్కు మారిన ఫొటోలను షేర్ చేస్తూ మిగతా వారు కూడా మారాలంటూ ప్రచారం చేయడం విశేషం.
ప్రపంచం మొత్తం 30 రోజుల ప్యాకేజీని అందిస్తుంటే భారత్‌లోని ప్రయివేటు టెలికాం సంస్థలు మాత్రం 28 రోజుల ప్లాన్‌తో వినియోగదారులను దోచేస్తున్నాయని అనేక మంది మండిపడ్డారు. వినియోగదారుల ప్రయోజనాలకు విరుద్ధంగా టెలికాం సంస్థలు ప్రవర్తిస్తే నిఘా పెట్టి నియంత్రించాల్సిన ట్రారు నిద్రవాస్థలో ఉందా అంటూ నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. నష్టాల సాకును చూపిస్తూ టెలికం కంపెనీలన్నీ సగటు భారతీయుల డబ్బును దోచేస్తున్నాయని మండిపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ నెట్వర్క్ బీఎస్ఎన్ఎల్ను ప్రయివేటుపరం చేయొద్దని.. ఇతర టెలికం వినియోగదారులు బీఎస్ఎన్ఎల్కు పోర్ట్ కావాలని ట్వీట్ల మద్దతు వర్షం కురుస్తోంది. దేశంలో అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ టారిఫ్సను 21 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. డిసెంబరు 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని తెలిపిన విషయం తెలిసిందే.