Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: స్మార్ట్ మిర్రర్ ఆధారిత వ్యక్తిగతీకరణ ఫిట్నెస్ మరియు వెల్నెస్ ఉపకరణం, పోర్టల్‌ను అధికారికంగా నేడు మార్కెట్లోకి విడుదల చేశారు. పోర్టల్ ఫౌండర్లు ఇంద్రనీల్ గుప్తా మరియు విశాల్ చందపేట తో పాటుగా నగరంలోని సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ ఉత్పత్తికి సంబంధించి వినూత్నమైన, అత్యున్నత స్ధాయి ఉత్పత్తి ఫీచర్లును వివరించారు. పోర్టల్‌లో వందలాది వర్కవుట్స్‌ను ఆన్‌డిమాండ్ మరియు లైవ్ క్లాస్‌ల రూపంలో హిట్, స్ట్రెంగ్త్, డ్యాన్స్ ఫిట్నెస్, ఎండ్యూరెన్స్, యోగా, మైండ్‌ఫుల్‌నెస్, న్యూట్రిషన్ కోచింగ్ లో పొందవచ్చు. ఈ ఉపకరణంలో ఉన్న బయో సెన్సార్లు ఒకరి రక్తపోటు, గ్లూకోజ్, ఈసీజీ, రెస్పిరేటరీ రేట్ వంటివి కూడా గుణిస్తారు. ఇవి వ్యక్తిగత వ్యాయామ ప్రక్రియను రూపొందించుకోవడంలో సహాయపడతాయి. ఈ ఆవిష్కరణ సందర్భంగా పోర్టల్ ఫౌండర్ అండ్ సీఈవో ఇంద్రనీల్ గుప్తా మాట్లాడుతూ ‘‘అత్యున్నత శ్రేణి వ్యక్తిగత శిక్షణను పోర్టల్ అందించడంతో పాటుగా ప్రపంచ శ్రేణి పర్సనల్ ట్రైనర్‌ను సైతం పొందే అవకాశం అందిస్తుంది. తమ జీవనశైలికి లోబడి ఆరోగ్యవంతమైన ప్రక్రియలను చురుగ్గా స్వీకరించే అవకాశమూ అందిస్తుంది. ఆకర్షణీయమైన ఈ స్మార్ట్‌మిర్రర్, అత్యున్నత స్ధాయి వ్యక్తిగతీకరణతో పాటుగా ఏఐ శక్తివంతమైన ఫార్మ్ ఫీడ్‌బ్యాక్‌తో సమగ్రమైన ఆరోగ్య, సంక్షేమ సహచరునిగా నిలుస్తుంది. ప్రతి ఇంటిలోనూ నూతన తరపు వ్యక్తిగతీకరించిన ఫిట్నెస్ను పోర్టల్ తీసుకురానుందని ఆశిస్తున్నాము’’అని అన్నారు.
పోర్టల్ ఫౌండర్ మరియు సీటీఓ విశాల్ చందపేట మాట్లాడుతూ ‘‘మారుతున్న వినియోగదారుల అవసరాలను పరిగణలోకి తీసుకుని ఈ స్మార్ట్ మిర్రర్ తీర్చిదిద్దాము. నేడు ఫిట్నెస్ ప్రియులు జిమ్ వాతావరణంలో మాత్రమే తమ శిక్షణ ఉండటం మాత్రం కాకుండా నాణ్యమైన శిక్షణను కోరుకుంటున్నారు. ఈ స్మార్ట్‌మిర్రర్‌తో వారు వ్యక్తిగతీకరించిన ఫిట్నెస్ ప్రోగ్రామ్‌లను ఇంటివద్దనే పొందవచ్చు’’ అని అన్నారు.