Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో మాంసాహార ఉత్పత్తులను అందించే బెంగుళూరుకు చెందిన నందూస్ సంస్థ తన కార్యకలాపాలను హైదరాబాద్ కు విస్తరించింది. ప్రస్తుతం రెండు ఔట్లెట్లను సంస్థ ప్రారంభించింది. అలాగే ఈ సంవత్సరం ముగిసేలోగా ఐదు ఔట్లెట్లను, వచ్చే ఏడాది లోగా మరో పదిహేను ఔట్లెట్లను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా నందూస్ సంస్థ వ్యవస్థాపక సి.ఈ.ఓ. నరేంద్ర పసుమర్తి మాట్లాడుతూ తమ స్టోర్లలో తాజా మటన్, చికెన్, ఫిష్, సి-ఫుడ్ తో పాటు రెడీ టు కుక్, రెడీ టు ఈట్ బిర్యానీ కూడా లభిస్తాయని సంస్థ తెలిపారు. ప్రముఖ పౌల్ట్రీ సంస్థ నందా గ్రూప్ లో భాగమైన నందూస్ సంస్థ హైదరాబాద్ లో తన కార్యకలాపాల కోసం 150 మందిని ఉద్యోగాల్లో నియమించుకోనున్నట్టు తెలిపింది. అలాగే వచ్చే నాలుగేండ్లలో దేశవ్యాప్తంగా మరో మూడువందల స్టోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పింది.