Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : అనీల్ అంబానీకి చెందిన బ్యాంకింగేతర విత్త సంస్థ రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ బోర్డును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) రద్దు చేసింది. ప్రస్తుతం కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యలను ఏ రకంగానూ పరిష్కరించేలా లేదని, అందుకే దాన్ని పాలనాపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దివాలా చట్టం కింద సంస్థ దివాలా ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వై నాగేశ్వర్రావును కంపెనీ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది.