Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోనస్, షేర్లు అదనం
న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) పరాగ్ అగర్వాల్ ఏడాదికి 10 లక్షల డాలర్లు (రూ.7.5 కోట్ల) వేతనం అందుకోనున్నారు. దీనికి అదనంగా 12.5 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.10 కోట్ల) విలువ గల స్టాక్స్ కేటాయిస్తారు. 2022 ఫిబ్రవరి నుంచి వీటిని 16 త్రైమాసికాల్లో ఆయనకు అందించనుంది.. అదనంగా బోనస్‌లు పొందనున్నారు. అగ్రశ్రేణి గ్లోబల్ టెక్నాలజీ సంస్థలకు సారధ్యం వహిస్తున్న భారతీయుల క్లబ్లో పరాగ్ అగర్వాల్ చోటు దక్కించుకున్నారు.
గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చారు, మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యనాదెళ్ల, అడోబ్ సిఇఒ శంతను నారాయణ్ తదితర భారతీయ సిఇఒల క్లబ్లో పరాగ్ అగర్వాల్ చేరడం విశేషం. పరాగ్ ఐఐటి ముంబయిలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో బిటెక్ పూర్తి చేశారు. ముంబయిలో జన్మించిన ఆయన 2011లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ట్విట్టర్లో అడుగు పెట్టారు. 2017 అక్టోబర్‌లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సిటిఒ)గా నియమితులయ్యారు.