Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నెల్లూరులోని వంట నూనెల శుద్ది కేంద్రాన్ని కార్గిల్ ఎడిబల్ ఆయిల్స్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ ఎడిబల్ ఆయిల్ ఉత్పత్తి కార్యకలాపాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా భారీ విస్తరణపై దృష్టి కేంద్రీకరించినట్లయ్యిందని ఆ సంస్థ తెలిపింది. దీని ఆధునీకరణ, విస్తరణ కోసం 35 మిలియన్ డాలర్ల (రూ.262 కోట్ల)ను పెట్టుబడిగా పెట్టినట్లు వెల్లడించింది. ఈ సంస్థ కొనుగోలుతో దక్షిణాలో మరింత విస్తరించడంతో పాటుగా సరఫరా చైన్‌ను బలోపేతం చేయడం ద్వారా వినియోగదారుల డిమాండ్‌ను తీర్చనున్నట్లు పేర్కొంది. ఈ కేంద్రం 2022 మే నాటికి పూర్తి కార్యకలాపాలు ప్రారంభించనుందని కార్గిల్స్ ఎడిబల్ ఆయిల్స్ బిజినెస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పియూష్ పట్నాయక్ తెలిపారు. గత కొన్ని ఏళ్లుగా భారత్‌లో వంట నూనెల వ్యాపారంలో గణనీయమైన వృద్థిని నమోదు చేస్తున్నామన్నారు. క్రిష్ణపట్నం ఎడిబల్ ఆయిల్ స్వాధీనంతో తమ విస్తరణ మరింత వేగవంతం కానుందన్నారు. ఈ కంపెనీ నేచర్ ఫ్రెష్, జెమిని, లియోనర్డో, సన్‌ఫ్లవర్ తదితర వంటనూనెలు, ఫ్యాట్స్ బ్రాండ్లతో వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తోంది.