Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఐటీసీ యొక్క సుప్రసిద్ధ అగర్బత్తీ బ్రాండ్, మంగళ్‌దీప్ తమ నూతన శ్రేణి అగరబత్తీలు ‘మంగళ్‌దీప్ ఉపవేద’ను ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. విలువ ప్రతిపాదన ఆధారంగా తీర్చిదిద్దిన ఈ అగర్బత్తిలు, వినియోగదారులను అతి పురాతనమైన భారతీయ సంప్రదాయాలతో అనుసంధానిస్తాయి. ఈ శ్రేణి అగరబత్తిలు కర్పూరం–తులసి మరియు పంచామృత్ సువాసనలతో వస్తాయి. ఈ అగర్బత్తిలను ‘పరంపర కీ మెహక్’ ప్రచారం ద్వారా విడుదల చేశారు. సంప్రదాయాలను ఉదహరించే సంస్థగా మంగళ్దీప్ను ఈ ప్రచారం వెల్లడిస్తుంది. ఉపవేద పై మంగళ్‌దీప్ యొక్క నూతన టీవీసీ ఓ హృద్యయాత్మక చిత్రం. కుటుంబ విలువలు ,సంప్రదాయాల చుట్టూ ఈ చిత్రం ఉంటుంది. మంగళ్‌దీప్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ మరియు సుప్రసిద్ధ నటి భూమికా చావ్లా ఈ ప్రకటనలో కథానాయికగా కనిపిస్తారు. మంగళ్‌దీప్ ఉపవేద అగరబత్తిల ద్వారా ఆమె కుటుంబమంతటినీ సంప్రదాయాలతో బంధించడం కనిపిస్తుంది. మంగళ్‌దీప్ యొక్క ఉపవేద అగరబత్తి సువాసనలను ఈ టీవీసీ చూపుతుంది. యువతరంతో సహా మొత్తం కుటుంబాన్ని అనుసంధానించే మార్గంగా ఇది ఈ చిత్రంలో కనిపిస్తుంది.
ఈ నూతన ప్రచారం గురించి శ్రీ గౌరవ్ తయాల్, ఫ్ ఎగ్జిక్యూటివ్, అగరబత్తి అండ్ సేఫ్టీ మ్యాచెస్ బిజినెస్, ఐటీసీ లిమిటెడ్ మాట్లాడుతూ ‘‘ భారతీయ సంస్కృతిలో అత్యంత కీలకమైనవి సంప్రదాయాలు. మా నూతన శ్రేణి ఉపవేద అగరబత్తిలను ఈ ‘కనెక్ట్ విత్ ట్రెడిషన్స్’(సంప్రదాయాలతో అనుసంధానం) ఆలోచనను మనసులో ఉంచుకుని, పురాతనమైన వేద గ్రంధాల నుంచి స్ఫూర్తి తీసుకుని తీర్చిదిద్దాము. ఈ శ్రేణిపై మా ప్రచారం సంప్రదాయాలతో కలిసి ఉన్న బంధాన్ని వేడుక చేస్తుంది. మరీ ముఖ్యంగా కుటుంబంలోని యువతరం కోసం దీనిని వేడుక చేస్తుంది’’ అని అన్నారు.
శ్రీ రాజేష్ మణి, గ్రూప్ క్రియేటివ్ డైరెక్టర్, ఓగ్ల్వీ మాట్లాడుతూ ‘‘ మన రోజువారీ జీవితంలో ఎంత ఖాళీ లేకుండా ఉన్నప్పటికీ మన సంప్రదాయాలను గౌరవించాలని మంగళ్ దీప్ ఉపవేద వెల్లడిస్తుంది. దీనిని మేము సంప్రదాయపు సువాసనగా పిలుస్తున్నాము. దీనికి కారణం, దీనిలో వినియోగించిన సంప్రదాయ పదార్ధాలు. ఈ టీవీసీలో అత్యంత అందంగా ఈ అంశాన్ని ఓ యువకుని రూపంలో ఒడిసిపట్టాము. అతనెప్పుడూ కూడా తనదైన ప్రపంచంలోనే ఉండిపోతుంటాడు. ఈ సువాసనలను ఆస్వాదించిన వెంటనే అతను తన సంప్రదాయాలను గుర్తుకు తెచ్చుకుంటాడు. సూక్ష్మమైనప్పటికీ మార్పు అనేది అతనిలో ప్రారంభమవుతుంది. సంప్రదాయాల వైపు సాగే అతని ప్రయాణంలో భాగంగా అతను తన రోజువారీ జీవితం/క్రమంలో వాటిని భాగంగా చేసుకుంటాడు. లూసిఫర్ సర్కస్ నుంచి దర్శకుడు దీపక్ థామస్ ఈ కథను అత్యంత అందంగా, తనదైన శైలి, భావుకత, సంగీతంతో వెల్లడించారు’’ అని అన్నారు.
మంగళ్‌దీప్ అగరబత్తీల సువాసన ద్వారా తమ సంప్రదాయాలతో ఏ విధంగా భక్తులు అనుసంధానించబడగలరనే అంశాన్ని ఈ నూతన వాణిజ్య ప్రకటనలో ఒడిసిపట్టారు. ఈ టీవీసీ ఆహ్లాదకరమైన అనుభవంతో ముగుస్తుంది. దీనిలో మొత్తం కుటుంబమంతా ఒకే చోటకు చేరుతుంది.
గత కొద్ది సంవత్సరాలుగా మంగళ్‌దీప్ పలు నూతన, వినూత్నమైన సువాసలను వినియోగదారులకు పరిచయం చేసింది. వైవిధ్యమైన సువాసనలకు మంగళ్‌దీప్ పెట్టింది పేరు. ఈ ప్రతిపాదనను మరింతగా విస్తరిస్తూ ఉపవేద శ్రేణి అగరబత్తిలను తీర్చిదిద్దారు. ఈ శ్రేణి అగరబత్తిలకు మహోన్నతమైన వేదిక విజ్ఞానం స్ఫూర్తి మరియు భారతీయ వేదాలలో వెల్లడించిన పూజా ద్రవ్యాలను దీనిలో ఉపయోగించారు. గత రెండు సంవత్సరాలుగా మంగళ్దీప్తో భూమిక ప్రయాణం కొనసాగుతుంది. మంగళ్‌దీప్ కమ్యూనికేషన్స్‌లో అతి జాగ్రత్తగా చూసుకునే మాతృమూర్తిగా ఆమె ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు.
మంగళ్‌దీప్ ఉపవేద కర్పూరం–తులసి, భారతీయ పూజా విధానంలో అత్యంత విరివిగా ఉపయోగించే రెండు పదార్ధాలైన కర్పూరం, తులసి సమ్మేళనం. తులసి మరియు కర్పూరం రెండింటికీ శుద్ధి చేసే లక్షణాలు ఉన్నాయి. ఈ ఉత్పత్తిని మన రోజువారీ పూజలో ఆ శుద్ధికరణ అనుభవాలను అందించేలా తీర్చిదిద్దారు. మరోవైపు, మంగళ్‌దీప్ ఉపవేద పంచామృత్, పలు పదార్ధాల వినూత్నమైన సమ్మేళనం. పంచామృతం తయారుచేయడంలో ఏవైతే పదార్థాలను వాడతామో అదే తరహా పదార్థాల అనుభూతులను ఇది అందిస్తుంది. పూజకు దైవిక అనుభవాన్ని అందించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది.