Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తరినిక బ్రాండ్ పక్ష, అంతర్జాతీయంగా అత్యున్నత నాణ్యత కలిగిన 925 వెండి ఆభరణాలకు సుప్రసిద్ధం. ఈ బ్రాండ్ ఇప్పుడు శృతి హాసన్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ప్రతిభావంతురాలైన నటి, సంగీతకారిణిగా శృతి, ఇప్పుడు కాలాతీత డిజైన్లు, అత్యున్నత నాణ్యత కలిగిన పక్ష యొక్క అత్యద్భుత శ్రేణి ఆభరణాలను ప్రదర్శించనున్నారు. ఈ బ్రాండ్ తమ ‘మ్యూజ్’ కలెక్షన్‌తో శృతిహాసన్‌తో ప్రత్యేకంగా ప్రచారమూ చేయనుంది.
ఈ బ్రాండ్ ప్రచారాలలో నాణ్యతాధారిత వారసత్వపు ఆభరణాలుపై అధికంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. శృతి ఈ ఆభరణాలను అంతర్జాతీయ విపణిలో ప్రదర్శించనున్నారు. ఈ భాగస్వామ్యంపై శృతిహాసన్ మాట్లాడుతూ ‘‘అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన పక్ష బై తరినిక బ్రాండ్‌తో భాగస్వామ్యం చేసుకోవడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాను. ఆభరణాల పరిశ్రమలో అగ్రగామి బ్రాండ్ ఇది. ఉత్సాహపూరితమైన నూతన ఆవిష్కరణలతో ఈ బ్రాండ్ ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే అవకాశం లభించడం పట్ల సంతోషంగా ఉంది. వీరి ఆభరణాలు అత్యంత సున్నితమైనవి. వీరి పనితనం విస్తృతశ్రేణిలో ఆభరణాల అభిమానులను ఆకట్టుకోనున్నాయి. వారి అత్యత్తమ ఆభరణాలను ధరించే అవకాశం నాకు లభించింది. వాటిని అందరికీ చూపనుండటం పట్ల ఆనందంగా ఉన్నాను’’ అని అన్నారు. ఈ భాగస్వామ్యంపై సునైనా రామిశెట్టి మాట్లాడుతూ ‘‘ అపార ప్రతిభావంతురాలు శృతి. ఈ కారణం చేత పక్షకు సహజసిద్ధంగానే ఆమె ప్రచారకర్తగా నిలువగలరు. బహుముఖ ప్రతిభాశాలి కావడంతో పాటుగా శక్తివంతమైన, ఉత్సాహపూరితమైన వ్యక్తిత్వం కలిగిన ఆమె బ్రాండ్‌కు సరైన గుర్తింపును తీసుకురాగలరు. పలు నైపుణ్యాలు కలిగిన శృతి, పూర్తి ఆత్మవిశ్వాసం కలిగిఉండటంతో పాటుగా అత్యంత ఆకర్షణీయంగా బ్రాండ్ సిద్ధాంతాన్ని తనదైన మార్గంలో ప్రదర్శించగలరు’’ అని అన్నారు.